బుధవారం 03 జూన్ 2020
Telangana - Dec 02, 2019 ,

గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన జర్నలిస్టులు

గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన జర్నలిస్టులు

హైదరాబాద్‌ : గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. భారీ సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని అల్లం నారాయణ సూచించారు. 


గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం ఇంతింతై వటుడింతై అన్నట్లు ముందుకు పోవడం మనందరి విజయం అని టీఆర్‌ఎస్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంతోష్‌ కుమార్‌ అన్నారు. సమాజం బాగుండాలని తపనపడి గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జర్నలిస్టు మిత్రులందరూ కదిలి రావడం నా హృదయాన్ని కదిలించింది. కలంతో జనాన్ని కదిలించిన జర్నలిస్టు మిత్రులు ఇప్పుడు మొక్కలు నాటి ప్రజలందరికి చైతన్యం కలిగించడం చారిత్రాత్మకం అని ఎంపీ సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు. 
logo