రవీంద్రభారతి, డిసెంబర్ 10: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పరిపాలనా పద్దతులు మార్చుకుంటేనే మనుగడ సాధించగలదని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. మంగళవా రం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు విరాహత్ అలీ అధ్యక్షతన ‘ప్రజల ఆకాంక్షలు – ఏడాది ప్రభుత్వ పాలన’ అనే అంశంపై రౌండ్ టే బుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విశ్రాంత ప్రొఫెసర్ పద్మజా షా మాట్లాడుతూ.. లగచర్ల, జైనూర్ ఘటన లు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే వి ధంగా ఉన్నాయని విమర్శించారు. హాస్ట ల్స్, గురుకులాలలో కలుషితాహార ఘటనలను నివారించాలని అన్నారు. రాష్ట్రం లో ఒకే సామాజికవర్గ పరిపాలన కొనసాగుతుందని గాయకుడు మాస్టార్జీ విమర్శించారు. తొమ్మిది మంది కళాకారులకు 300 గజాల స్థలం, కోటి రూపాయలు నగదు ఇస్తామని సీఎం ప్రకటించారని, లబ్ధిదారులను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో ప్రజలకు వెల్లడించాలని ఆయన కోరారు. రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగులు, రైతులను పూర్తిగా విస్మరించిందని డాక్టర్ వివి రావు ఆరోపించారు. ఉచిత బస్సు పేరుతో మహిళలను అవమానిస్తున్నారని సామాజిక విశ్లేషకురాలు సజయ అన్నారు.
నైపుణ్యాల కేంద్రం.. హైదరాబాద్
హైదరాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): నైపుణ్యాల కలిగిన యువతకు కేంద్రంగా హైదరాబాద్ నగరం గుర్తింపు పొందింది. ఎమర్జింగ్ టాలెంట్ విభాగంలో జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. హైదరాబాద్ తర్వాతి స్థానాల్లో గుంటూరు, లక్నో నగరాలు నిలిచాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సంయుక్తంగా ఇండియా స్కిల్స్ రిపోర్ట్ – 2022ను విడుదల చేశాయి. రాష్ట్రంలో ఉద్యోగ కల్పన రేటు 63 శాతం ఉండగా, హైదరాబాద్‌లో 64.7 శాతం ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. ఉద్యోగ కల్పన రేటు ఎక్కువ ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. కాగా, దేశంలో ప్రస్తుతం ఏఐ, మెషిన్ లెర్నింగ్, డాటా సైన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్ నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది.