హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రజాకవి కాళోజీ సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వచ్చేనెల 15, 16వ తేదీల్లో రెండు రోజులపాటు సాహిత్య సభలు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కాళోజీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి ఎమ్మెల్సీ కవిత పూలమాల వేసి నివాళి అర్పించారు.
తెలంగాణ ధికార తత్వానికి కాళోజీ ప్రతీక అని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే ప్రతిష్ఠాత్మక కాళోజీ పురసారం అందుకొన్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖకవి, శ్రీరామోజు హరగోపాల్‌కు ఆమె ఆత్మీయ సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.