హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఇతర పోలీస్ విభాగాల్లో ఫంక్షనల్ వర్టికల్స్(పని విభజన అంశాలు)ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశంలోనే తొలిసారిగా పోలీస్ విధులను మొత్తం 17 అంశాలుగా విభజించారు.
ఇందులో పోలీస్ స్టేషన్ రిసెప్షన్, స్టేషన్ రైటర్, క్రైం రైటర్, బ్లూకోల్ట్స్, మొబైల్ పెట్రోల్కార్లు, క్రైం స్టాఫ్, వారంట్ డ్యూటీ, సమన్స్ డ్యూటీ, టెక్ టీం, మెడికల్ సర్టిఫికెట్ డ్యూటీ, సబ్ ఇన్స్పెక్టర్ అడ్మిన్, సెక్షన్ డ్యూటీ ఇన్చార్జి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, సెక్టార్ సబ్ ఇన్స్పెక్టర్, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఇలా పని విభజన అంశాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటిని డీజీపీ కార్యాలయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సమన్వయం చేస్తుందని జీఓలో పేర్కొన్నారు.