‘ఎన్ఆర్ఈజీఎస్’ అమలులో తెలంగాణ అగ్రస్థానం : మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

వరంగల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈజీఎస్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం 30శాతం వేతనాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు హన్మకొండలోని ఆర్ఎండీబీ అతిథి గృహంలో ఇవాళ మంత్రి దయాకర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని అన్నారు.
రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నా ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా సీఎం కేసీఆర్ 30 శాతం వేతనాలు పెంచారని గుర్తుచేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. ఉపాధిహామీ పథకం అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రావు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయకుమార్, టెక్నీకల్ అసిస్టెంట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, అటెండర్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

