గుజరాత్‌కు నిరంతరం కరెంటివ్వరా?
- 15 ఏండ్లు సీఎంగా చేసినా అక్కడ పరిస్థితి మారలేదా?
- విద్యుత్తు సరఫరాలో తెలంగాణే ఆదర్శం
- పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని
కామారెడ్డి, జూన్ 4: గుజరాత్‌కు 15 ఏండ్లపాటు సీఎంగా పని చేసిన నరేంద్రమోదీ రెండోసారి దేశ ప్రధాని అయినా గుజరాత్ రాష్ర్టానికి 6 గంటల కరెంట్ ఇవ్వడం లేదని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశానికి 24 గంటల కరెంట్ ఎందుకు అందజేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎనిమిది ఏండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో గొర్రెల యూనిట్ల పంపిణీ, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ సందర్భంగా తలసాని మాట్లాడారు. దేశ ప్రజలు అమాయకులు కాదని, మోసం ఎల్లకాలం చేయలేరని ప్రజలు త్వరలోనే బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.
ఎన్నికలకు పోయే దమ్ముందా?
‘బదలావ్ చాహియే.. అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టానికి వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారని.. కానీ మిమ్మల్నే మార్చాలని దేశం కోరుకుంటున్నది’ అని మంత్రి తలసాని అన్నారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటనలు చేయడం కాదని.. దమ్ముంటే దేశంలో ఎన్నికలు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. ఉపన్యాసాలు, మాటలు చెప్పడం కాదు.. చేతల్లో అభివృద్ధిని చూపించాలని మోదీకి సూచించారు. మంత్రి కేటీఆర్ భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రధాని అవుతారని బీజేపీ నేతలు ఇప్పటినుంచే భయపడుతున్నారని తెలిపారు. కేటీఆర్ మాట్లాడే విధానం, భాషా పరిజ్ఞాన, ప్రతి విషయంపై స్పష్టమైన అవగాహన ఉండటంతో బీజేపీ నేతల్లో వణుకు పుడుతున్నదన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ బాల్రాజుయాదవ్, బెవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

