ఓడీఎఫ్‌లో దేశంలోనే నంబర్ 1గా తెలంగాణ.. అభినందించిన కేంద్రం
Telangana is number 1 in the country in ODF |

హైదరాబాద్ : దేశంలో అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలుస్తున్న తెలంగాణ మరోసారి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించిన బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత (ODF- ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) సమాజ నిర్మాణంలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ విడుదల చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.
స్వచ్ఛ భారత్ మిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు స్వచ్ఛ గ్రామాల్లో మూడింట ఒకటో వంతు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రమే ఓడీఎఫ్‌ను పూర్తి చేసిందన్నారు. అలాగే దేశంలో 17, 684 ఓడీఎఫ్ గ్రామాలుండగా ఇందులో 6,537 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయి. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని గ్రామాలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి వంటి పథకాల వల్లతోనే మన పల్లెలు ఆదర్శంగా మారాయని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపడుతూనే.. నిరంతరం పారిశుధ్య పనులు చేయడంతోనే ఇలాంటి అభినందనలు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రాష్ట్ర, భారత నిర్మాణంలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది, ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

