Telangana | హైదరాబాద్ : 2023-24 విద్యా సంవత్సరానికి గానూ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు( Intermediate Board ) అకడమిక్ క్యాలెండర్( Academic Calendar )ను విడుదల చేసింది. జూన్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది.
అక్టోబర్ 19 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులను( dasara holidays ) ప్రకటించింది. 26వ తేదీన తిరిగి కాలేజీలు తెరుచుకోనున్నాయి. నవంబర్ 20 నుంచి 25వ తేదీ వరకు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 2024, జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు( Sankranthi Holidays ) ప్రకటించింది. 17వ తేదీన ఇంటర్ కళాశాలల తరగతులు ప్రారంభం కానున్నాయి. జనవరి 22 నుంచి 29 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది.