CM KCR | తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైంది : సీఎం కేసీఆర్
CM KCR | తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైందని, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల కిందటి చారిత్రక ఆనవాళ్లు రాష్ట్రంలో లభ్యంకావడం మనకు గర్వకారణమన్నారు.
CM KCR | తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమైందని, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల కిందటి చారిత్రక ఆనవాళ్లు రాష్ట్రంలో లభ్యంకావడం మనకు గర్వకారణమన్నారు. ఈ దిశగా చరిత్రకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తెలంగాణ చరిత్రను భావితరాలకు తెలిపేలా భారత జాగృతి సంస్థ ప్రచురించిన.. తెలంగాణ చరిత్ర పుస్తకం 5 సంపుటాలను.. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రగతి భవన్లో సీఎం ఆవిష్కరించారు.
భారత జాగృతి చరిత్ర విభాగం గత ఆరేళ్లుగా తెలంగాణలోని అనేక చారిత్రక ప్రదేశాలను, చరిత్రకారుడు రచయిత శ్రీరామోజు హరగోపాల్ ఆధ్వర్యంలో పలువురు చరిత్రకారులు సందర్శించారు. క్షేత్రస్థాయిలో పరిశోధన చేసి సేకరించిన సమాచారాన్ని, మామిడి హరికృష్ణ, వేముగంటి మురళీకృష్ణ సంపాదకత్వంలో పుస్తకాలకు రూపకల్పన చేశారు. చరిత్ర రచన కోసం ఆయా ప్రదేశాలలోని శిలాజాలు, కట్టడాలు, శాసనాలు, నాణేలు, గ్రంథాలు సహా అన్ని రకాల చారిత్రక ఆధారాలను అధ్యయనం చేసినట్లు వారు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దాదాపు 20కోట్ల సంవత్సరాల పైబడిన చరిత్ర ఆనవాళ్లు రాష్ట్రంలో లభ్యమవడం మనందరికీ గర్వకారణమన్నారు.
ఆయా కాలాల్లో కొనసాగిన సామాజిక పరిస్థితులు, పరిపాలన రీతులు, నాటి దార్శనికతను అర్థం చేసుకుంటే రేపటికి మనకు దారి చూపుతాయని తెలిపారు. గత చరిత్రను అర్థం చేసుకోవడం ద్వారా, వర్తమానాన్ని అవగాహన చేసుకుంటూ తద్వారా భవిష్యత్‌కు బాటలు వేసుకోగలమని పేర్కొన్నారు. అనంతరం జాగృతి చరిత్ర విభాగం బాధ్యులతో పాటు సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను సీఎం అభినందించారు. కార్యక్రమంలో చరిత్రకారుడు రచయిత శ్రీరామోజు హరగోపాల్, కవి సంపాదకులు వేముగంటి మురళీకృష్ణ, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

