కన్నవారితో రాజీకి ప్రయత్నించండి.. నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు హైకోర్టు హితవు
పిల్లల నిరాదరణకు గురవుతు న్నామంటూ తల్లిదండ్రులు నేరుగా కోర్టులకు రావడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. కన్నవారితో రాజీ ప్రయత్నాలు చేయాలని హితవు పలికిం ది. తొలుత సానుకూల ధోరణితో సమస్యను పరిషరించుకొనే చర్యలు చేపట్టాల ని సూచించింది.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ) : పిల్లల నిరాదరణకు గురవుతు న్నామంటూ తల్లిదండ్రులు నేరుగా కోర్టులకు రావడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. కన్నవారితో రాజీ ప్రయత్నాలు చేయాలని హితవు పలికిం ది. తొలుత సానుకూల ధోరణితో సమస్యను పరిషరించుకొనే చర్యలు చేపట్టాల ని సూచించింది. ఇలా చేయకుండానే పిల్లల నుంచి ఆస్తులను ఖాళీ చేయించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టులను కోరుతున్నారని పేర్కొన్నది. తనను పట్టించు కోని కుమారుడి నుంచి ఆస్తిని ఇప్పించాలన్న తన అభ్యర్థనలను అధికారులు పట్టించుకోకపోవడంతో సూర్యాపేట జిల్లాకు చెందిన 66 ఏండ్ల వృద్ధురాలు వేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి విచారించారు.
పిటిషనర్ సంక్షేమాన్ని కుమారుడు పట్టించుకోలేదని, ప్రస్తుతం కుమార్తె వద్ద పిటిషనర్ ఉంటున్నారని న్యాయవాది వివరించారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలి తం దక్కలేదని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. తమ సంరక్షణను పిల్లలు పట్టించుకోవడం లేదంటూ తల్లిదండ్రులు కోర్టులకు వస్తున్న కేసులు పెరు గుతున్నాయని తెలిపింది. ఈ కేసులో కుమారుడు పట్టించు కోవడంలేదని చెప్తున్నారని, కుమార్తె ఒకరే ఉంటే వారికీ తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పింది. ప్రత్యామ్నాయ మార్గాలైన రాజీ, చర్చలు లేకుండా నేరుగా పిల్లల నుంచి ఆస్తి ఇప్పించాలన్న పిటిషన్ల సంఖ్య పెరిగిందని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై వివరాలు సమర్పించాలని సూర్యాపేట అధికారులకు ఆదేశించింది. విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

