క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి మినహాయింపు కుదరదు
2005-06వ సంవత్సరం నుంచి 2014-15 వరకూ ప్రైవేట్ విద్యుత్తు సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసిన సంస్థలకు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి (సీఎస్ఎస్) మినహాయింపు ఉండదని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది.
- ఎస్పీడీసీఎల్ డిమాండ్ నోటీసు సబబే
- 27 సంస్థల పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): 2005-06వ సంవత్సరం నుంచి 2014-15 వరకూ ప్రైవేట్ విద్యుత్తు సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసిన సంస్థలకు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి (సీఎస్ఎస్) మినహాయింపు ఉండదని హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసినవారు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి చెల్లించాలంటూ ఎస్పీడీసీఎల్ జారీ చేసిన డిమాండ్ నోటీసు, స్పీకింగ్ ఆర్డర్లు సబబేనంటూ తీర్పు వెల్లడించింది.
క్రాస్ సబ్సిడీ సర్‌చార్జి చెల్లించాలంటూ ఎస్పీడీసీఎల్ జారీ చేసిన డిమాండ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ మైహోమ్స్ ఎస్టేట్స్, డాల్ఫిన్ హోటల్స్, మార్గదర్శి చిట్‌ఫండ్, గ్రీన్పార్ హోటల్, ఆర్ఎస్ బ్రదర్స్, అపోలో, కిమ్స్ హాస్పిటల్, యశోదా హెల్త్‌కేర్ సర్వీసెస్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్తోపాటు సుమా రు 27 వ్యాపార సంస్థలు, కంపెనీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టి తీర్పు ఇచ్చారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 93, 112 ప్రకారం విద్యుత్తును విక్రయించేందుకు కల్పించిన అనుమతులు ప్రోత్సాహకాలుగా మాత్రమే పరిగణించాల్సి ఉన్నదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అందువల్ల విక్రయానికి ఇచ్చిన అనుమతులను సమ్మతిగా పరిగణించలేమని స్పష్టంచేశారు. విద్యుత్తు సరఫరా చేయడానికి ఉత్పత్తి సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన సమ్మతి సమర్పించడంలో కంపెనీలు విఫలమయ్యాయని, అందువల్ల విద్యుత్తు పంపిణీ సంస్థ 2025లో జారీ చేసిన డిమాండ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్లో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్లను కొట్టివేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్లను కొట్టివేయడం ద్వారా డిసమ్లకు రూ.20 కోట్లకుపైగా ఆదాయం సమకూరనున్నది. అంతేగాక మరో 35 పిటిషన్లు ఇంకా విచారణలో పెండింగ్‌లో ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

