హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డల సంక్షేమంలో తెలంగాణకు ఎదురులేదని, మహిళా సాధికారతలో తిరుగులేదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళలకు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం. సంక్షేమంలో సగం కాదు.. ఆమే అగ్రభాగం’ అంటూ ట్వీట్ చేశారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళలకు కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఆకాశంలో సగం కాదు.. ‘ఆమే’ ఆకాశం
సంక్షేమంలో సగం కాదు.. ‘ఆమే’ అగ్రభాగం
మహిళా సంక్షేమంలో.. మన తెలంగాణ రాష్ట్రం..
యావత్ దేశానికే ఆదర్శం..
అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి…
ఆరు పదులు దాటిన అవ్వల వరకు…
అందరినీ కంటికి రెప్పలా కాపాడుతోంది…
మనసున్న కేసీఅర్ సరార్.
ఆడబిడ్డల సంక్షేమంలో మనకు ఎదురులేదు.
మహిళా సాధికారతలో మనకు తిరుగులేదు