నిమ్స్ విస్తరణకు 1,571 కోట్లు
ప్రస్తుతం నిమ్స్ దవాఖానలో 1,800 పడకలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా నిర్మించనున్న భవనంలో మరో 2,000 ఆక్సిజన్ పడకలను ఏర్పాటుచేయనున్నారు
- మరో 2 వేల పడకలతో నూతన భవనం
- పరిపాలనా అనుమతులు మంజూరు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ప్రస్తుతం నిమ్స్ దవాఖానలో 1,800 పడకలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా నిర్మించనున్న భవనంలో మరో 2,000 ఆక్సిజన్ పడకలను ఏర్పాటుచేయనున్నారు. దీంతో నిమ్స్‌లో మొత్తం పడకల సంఖ్య 3,800కు పెరుగుతుంది.
హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైద్యరంగంలో మరో పెద్ద ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) దవాఖాన విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను మంజూ రు చేసింది. నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లతో రూపొందించిన డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్ దవాఖానకు రోగుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో దానిని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిమ్స్ విస్తరణ, కొత్తభవనాల నిర్మాణం కోసం ఎర్రమంజిల్‌లోని ఆర్అండ్బీ శాఖకు చెందిన స్థలాన్ని వైద్యారోగ్యశాఖకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో నిమ్స్ విస్తరణకు రూ.1,571 కోట్లతో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ రూపొందించిన డీపీఆర్‌ను ప్రభుత్వం ఆమోదించింది. నిమ్స్ విస్తరణ పనుల బాధ్యతను ఆర్అండ్బీ శాఖకు అప్పగించింది.

కొత్తగా రెండువేల ఆక్సిజన్ పడకలు
ప్రస్తుతం నిమ్స్ దవాఖానలో 1,800 పడకలు అందుబాటులో ఉన్నాయి. దానికి అనుబంధంగా కొత్తగా నిర్మించనున్న భవనంలో మరో 2,000 ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో నిమ్స్‌లో మొత్తం పడకల సంఖ్య 3,800కు పెరుగుతుంది. కొత్తగా ఏర్పాటుచేయనున్న బెడ్స్‌లో 500 పడకలను ఐసీయూకు కేటాయిస్తారు. గుండె, కిడ్నీ, మెదడు, కాలేయం, క్యాన్సర్, అత్యవసర వైద్యసేవల విభాగం, ట్రామా, ఆర్థోపెడిక్ తదితర 42 స్పెషాలిటీస్ సేవలు కొత్త భవనంలో అందుబాటులోకి రానున్నాయి. సూపర్ స్పెషాలిటీ నర్సింగ్, అనుబంధ హెల్త్ సైన్సెస్ విభాగాల్లో సైతం శిక్షణ కోర్సులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరం నలువైపులా నిర్మించనున్న 4 టిమ్స్ సూపర్‌స్పెషాలిటీ దవాఖానల్లో 4,000 పడకలు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో 2,000 పడకలు, నిమ్స్‌లో 2,000 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలుపడంపై నిమ్స్ లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ మార్త రమేశ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నదని కొనియాడారు.
పేదల వైద్యానికి కేసీఆర్ పెద్దపీట: మంత్రి హరీశ్‌రావు
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తున్నది. ప్రజా వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నది. నిమ్స్ విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలుపడం సంతోషదాయకం. తెలంగాణ వైద్య రంగంలో ఇది మరో పెద్ద ముందడుగు.
– ట్విట్టర్లో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

