శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 02:31:08

ఉచితంగా హోంఐసొలేషన్‌ కిట్లు

ఉచితంగా హోంఐసొలేషన్‌ కిట్లు

  • కొవిడ్‌ బాధితులకు సర్కారు అండ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా బారినపడి ఇంట్లోనే చికిత్స పొందుతున్నవారికి సర్కారు హోంఐసొలేషన్‌ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వీరికోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ను ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా అవసరమైన మందులు, ఇతర సామగ్రితో ఉన్న కిట్లను ఉచితంగా అందజేస్తున్నది. రాష్ట్రంలో దాదాపు 10 వేలకు పైగా బాధితులు హోంఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. టెలిమెడిసిన్‌ ద్వారా సూచనలుచేస్తున్నారు. అత్యవసరమైనవారి కోసం త్వరితగతిన అంబులెన్సులను ఇండ్లకు పంపించి కొవిడ్‌ దవాఖానల్ల్లో చేర్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న ఐసొలేషన్‌ కిట్లు ప్రా ముఖ్యతను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో 85శాతం కేసుల్లో ఎలాం టి లక్షణాలు లేనివారే ఉన్నారు. వీరు హోంఐసొలేషన్‌లో తీసుకోవాల్సిన మందులు ఈ కిట్‌లో ఉం టా యి. దీంతోపాటు హోంఐసొలేషన్‌ లో ఎలా ఉండాలో సూచించే బ్రోచ ర్‌, కాల్‌ సెంటర్‌ నంబర్లు, వైద్యు లు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల మొబై ల్‌ నంబర్లను పొందుపరిచారు.

ఐసొలేషన్‌ కిట్‌లో ఉండే వస్తువులు

విటమిన్‌-సీ టాబ్లెట్స్‌ 
34
జింక్‌ టాబ్లెట్స్‌
17
బీ- కాంప్లెక్స్‌ 
17
క్లాత్‌ మాస్కులు
6
శానిటైజర్‌ 
1
హ్యాండ్‌ వాష్
1
గ్లోవ్స్
2

సోడియం హైపోక్లోరైట్‌ ద్రవం1 బాటిల్‌


logo