అత్యధిక వేతనాలు మనోళ్లకే

- తెలంగాణలో ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్
- రాష్ట్రం వచ్చాక 6.69 లక్షల కొత్త రేషన్‌కార్డులు
- విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. పీఆర్సీ అమలు, పదోన్నతులు, మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. పదోన్నతులకు సర్వీస్‌రూల్స్ సడలింపు వంటివి అమలు చేస్తున్నది. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌గా వ్యవహరిస్తున్నది. శుక్రవారం అసెంబ్లీలో సంక్షేమరంగంపై చర్చ సందర్భంగా ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఆ వివరాలు ఇలా..
పీఆర్సీ.. పదవీ విరమణ వయసు పెంపు
- 2015లో ఉద్యోగులకు 43 శాతం, 2020లో 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలుచేసింది.
- కరోనాతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా ఉద్యోగులకు వేతనాలు పెంచింది.
- 33 శాతం వేతన పెరుగుదలను అవుట్సోర్సింగ్ తదితర ఉద్యోగులకూ వర్తింపజేసింది.
- దేశంలోనే తెలంగాణ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు అందుతున్నాయి.
- ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచింది.
పౌరసరఫరాలు
- గతంలో వ్యక్తికి నెలకు 4 కిలోల చొప్పున రేషన్‌బియ్యం ఇచ్చేవారు. దాన్ని ప్రస్తుతం 6 కిలోలకు పెంచింది.
- రేషన్‌బియ్యంపై పరిమితి ఎత్తివేసింది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నది.
- 2014 నుంచి ఇప్పటివరకు కొత్తగా 6.69 లక్షల రేషన్‌కార్డులు మంజూరుచేసింది.
సన్నబియ్యం
- విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కోసం మేలురకం సన్నబియ్యం సరఫరా చేసింది.
- సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, అంగన్వాడీలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది.
- ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.280 కోట్ల సబ్సిడీని భరిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

