6న రాష్ట్ర బడ్జెట్.. నోటిఫికేషన్ జారీచేసిన రాజ్‌భవన్
2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ నెల 6న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
- 3న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం
హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఈ నెల 6న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ఈ నెల 3న గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఉభయసభలు శుక్రవారం మధ్యా హ్నం 12.10 గంటలకు అసెంబ్లీహాల్లో సమావేశం కానున్నట్టు గవర్నర్ తమిళిసై మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? గవర్నర్ ప్రసంగం, బడ్జెట్, పద్దులపై చర్చ ఏ రోజున చేపట్టాలనే అంశాలపై బీఏసీలో నిర్ణయిస్తారు.
బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను శాసనసభ కార్యదర్శి డాక్టర్ వీ నర్సింహాచార్యులు మంగళవారం పరిశీలించారు. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి బుధవారం సమీక్షంచనున్నారు. శాసనసభా సమావేశాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. బడ్జెట్ ప్రసంగం, ప్రతులు, పద్దులపై చర్చ, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తదితర అంశాలపై అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

