హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా (టీజీఎల్ఐ) ప్రీమియం చెల్లిస్తున్న 56 ఏండ్ల లోపున్న ప్రభుత్వ ఉద్యోగులు బీమా ప్రయోజనాలు పొందేందుకు ప్రతిపాదన పత్రాలను సమర్పించాలని టీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బీమా ప్రిమీయాన్ని చెల్లిస్తున్న ఉద్యోగులు, టీచర్లు జిల్లా బీమా కార్యాలయాలను సంప్రదించి, పాలసీల నంబర్లను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో, ఉద్యోగుల మాస్టర్ జాబితాలో అప్డేట్ చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో నెలవారీగా చెల్లించే ప్రీమియం అనామతు ఖాతాల్లోకి వెళ్తుందని హెచ్చరించారు.