Age Limit | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు
Age Limit | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయోపరిమితిని మరో పదేళ్లకు పెంచింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
Age Limit | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయోపరిమితిని మరో పదేళ్లకు పెంచింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం సాధారణ ఉద్యోగాల కోసం గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా ఉంది. కాగా, తాజా ఉత్తర్వులతో ఈ వయోపరిమితి 44 ఏళ్లకు పెరిగింది. ఈ వయో సడలింపు ఏడాది పాటు అమలులో ఉండనుంది. నిరుద్యోగ యువత నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా కాలం, నియామకాల ఆలస్యం, నోటిఫికేషన్లు లేకపోవడం వంటి పలు కారణాల వల్ల చాలామంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయారని.. వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలోని వివిధ నియామక సంస్థలు విడుదల చేసే నోటిఫికేషన్లకు ఈ వయోసడలింపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే ఈ సడలింపు యూనిఫాం సర్వీసులకు వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేశారు. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైలు, అటవీ శాఖల వంటి శారీరక ప్రమాణాలు అవసరమైన ఉద్యోగాలకు ఈ వయోపరిమితి పెంపు వర్తించదని పేర్కొన్నారు.

Age Limit
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

