ఆయిల్‌ఫెడ్‌లో 103 ఉద్యోగాల భర్తీకి అనుమతి
చాలా నెలల నిరీక్షణ తర్వాత ఆయిల్‌ఫెడ్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ) : చాలా నెలల నిరీక్షణ తర్వాత ఆయిల్‌ఫెడ్‌లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పనిభారం తగ్గించేందుకు, రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఉద్యోగులను భర్తీ చేయాలంటూ మూడేండ్లుగా ఆయిల్‌ఫెడ్ అధికారులు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. తాజాగా వీరి విజ్ఞప్తికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో 103 పోస్టుల భర్తీకి అవకాశం కల్పించింది. ఇందులో 73 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నది. రాత పరీక్ష, ఎంపిక బాధ్యతను జేఎన్టీయూకి అప్పగించనున్నది. వీలైనంత త్వరగా ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మిగిలిన 30 పోస్టులను అవసరాల మేరకు ఔట్సోర్సింగ్ విధానంలో నియమించుకునేందుకు అవకాశం ఇచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

