బీఆర్ఎస్ సర్పంచ్ ఇంటిపై దండయాత్ర!
ఓ ప్రభుత్వ అధికారి పరుష పదజాలంతో దళిత సర్పంచ్ ఇంటిపై దండయాత్రు చేస్తూ అమానుషంగా ప్రవర్తించిన ఘటన సీఎం రేవంత్ ఇలాకా నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారంలో చోటుచేసుకున్నది.
- బుల్డోజర్తో దూసుకొచ్చిన డీఈ అంజిరెడ్డి
- అధికారి తీరుపై మహిళల ఆగ్రహం
కోస్గి, నవంబర్ 2 : ఓ ప్రభుత్వ అధికారి పరుష పదజాలంతో దళిత సర్పంచ్ ఇంటిపై దండయాత్రు చేస్తూ అమానుషంగా ప్రవర్తించిన ఘటన సీఎం రేవంత్ ఇలాకా నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారంలో చోటుచేసుకున్నది. బాధితులు, సర్పంచ్ కృష్ణ తెలిపిన వివరాలు మేరకు.. సోమవారం ఉదయం రోడ్దు విస్తరణ పనుల కోసం ప్రభు త్వం సూచించిన మేర ఇండ్లు కూల్చివేస్తామని బుల్డోజర్తో డీఈ అంజిరెడ్డి.. సర్పంచ్ కృష్ణ ఇంటి ముందుకు వచ్చారు.
అప్పటికే బయట ఉన్న సర్పంచ్ రోడ్డు విస్తరణ పనుల సమాచారం ముందస్తుగా చెప్పరా? అని అధికారిని ప్రశ్నించాడు. దీంతో డీఈ ఆవేశంతో సర్పంచ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ఇప్పటికే ఐదు నెలలుగా ఆగామని.. ఇళ్లు కూల్చే వరకు వదిలేది లేదని జేసీబీతో సర్పంచ్ ఇంటిపైకి దండయాత్రకు దిగాడు. దీంతో సర్పంచ్ కుటుంబీకులు బుల్డోజర్కు అడ్డు నిలబడి.. తమను చంపి ఇంటిని కూల్చండంటూ భీష్మించారు. స్థానిక మహిళలు అక్కడకు చేరుకొని అధికారిపై తిరగబడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

