విజయానికి దర్పణం పల్లెప్రగతి
సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ‘స్వచ్ఛభారత్ సర్వేక్షణ్'లో మరోసారి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శ, పారదర్శక పాలనకు అద్దం పడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సమష్టి కృషితో, పల్లెప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని పునరుద్ఘాటించారు
- స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డులే నిదర్శనం
- ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుదాం
- భాగస్వాములకు సీఎం అభినందన
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ‘స్వచ్ఛభారత్ సర్వేక్షణ్’లో మరోసారి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శ, పారదర్శక పాలనకు అద్దం పడుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సమష్టి కృషితో, పల్లెప్రగతిని సాధిస్తూ, పచ్చని తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని పునరుద్ఘాటించారు.
గ్రామీణ స్వచ్ఛభారత్ మిషన్ కింద పలు విభాగాల్లో రాష్ట్రం 13 అవార్డులు దకించుకొని దేశంలోనే మొదటి స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తంచేశారు. ఇందుకు దోహదం చేసిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రిని, ఉన్నతాధికారులను, సిబ్బందిని, సర్పంచ్‌లను, ఎంపీటీసీలను, గ్రామకార్యదర్శులను సీఎం కేసీఆర్ అభినందించారు. ‘అప్రతిహత ప్రగతితో ముందుకుసాగుతున్న తెలంగాణ రాష్ట్రం, దేశ ప్రగతిలో తనవంతుగా గుణాత్మక భాగస్వామ్యాన్ని పంచుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సందర్భం. ఇదే పరంపరను కొనసాగిస్తాం’ అని అన్నారు.
ఎర్రబెల్లికి ఫోన్లో అభినందనలు
కేంద్రం ప్రకటించిన స్వచ్ఛసర్వేక్షణ్‌లో తెలంగాణ ఆగ్రస్థానంలో నిలిచినందుకు గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సీఎం కేసీఆర్ అభినందించారు. శుక్రవారం ఫోన్ చేసి అభినందించారని మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపినందుకు కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారని, ఇదే తరహా అభివృద్ధిని కొనసాగించాలని సూచించారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

