బిల్లులు పెండింగ్.. కాటగల్సిన కరెంట్!
రాష్ట్రంలో ఒకవైపు విద్యుత్తు సంక్షోభం.. తద్వారా నీటి సంక్షోభం కొనసాగుతున్నది. కరెంటు కష్టాలతో యావత్తూ రైతాంగం కుదేలవుతున్నది. కరెంటు సంక్షోభానికి గల ప్రధాన కారణాల్లో ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం ఒకటైతే, కీలక శాఖల మధ్య సమన్వయం లోపించడం రెండో కారణంగా తెలుస్తున్నది. రాష్ట్రంలో ఎత్తిపోతల నిర్వహణ సమర్థవంతంగా కొనసాగాలంటే 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఉండాలి.
- సర్కార్ అసమర్థత, శాఖల మధ్య సమన్వయ లోపంతో
- సాగు, కరెంట్ సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణ
- ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన రూ.33,653 కోట్లను
- విడుదల చేయని సర్కార్.. కరెంటు కట్ చేసిన సంస్థ
- బకాయిల నిలిపివేతతో బొగ్గు సైప్లెని ఆపేసిన సింగరేణి
- ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా కీలక శాఖల తీరు
- నిధుల కోసం పెరిగిన పంతం.. అంతిమంగా రైతులకు గోస
(కొంటు మల్లేశం)
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒకవైపు విద్యుత్తు సంక్షోభం.. తద్వారా నీటి సంక్షోభం కొనసాగుతున్నది. కరెంటు కష్టాలతో యావత్తూ రైతాంగం కుదేలవుతున్నది. కరెంటు సంక్షోభానికి గల ప్రధాన కారణాల్లో ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడం ఒకటైతే, కీలక శాఖల మధ్య సమన్వయం లోపించడం రెండో కారణంగా తెలుస్తున్నది. రాష్ట్రంలో ఎత్తిపోతల నిర్వహణ సమర్థవంతంగా కొనసాగాలంటే 24 గంటల నాణ్యమైన విద్యుత్తు ఉండాలి. ఈ మేరకు డిమాండ్‌కు తగినంతగా విద్యుత్తును సప్లయ్ చేయాలి. దీనికోసం విద్యుదుత్పన్ని చేపట్టాలి. లేదంటే కొనుగోలు చేయాలి. విద్యుదుత్పత్తికి బొగ్గు కొరత లేకుండా చూడాలి.
ఇందుకు ఇరిగేషన్, ట్రాన్స్‌కో, జెన్కో, సింగరేణి సంస్థల మధ్య సమన్వయం అంత్యంత ముఖ్యం. కానీ, కాంగ్రెస్ పాలనలో ఆయా శాఖలు ప్రస్తుతం ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ పట్టింపులేనితనం కారణంగా నిధుల కోసం ఎవరికి వారుగా పంతాలకుపోతూ ప్రస్తుత సంక్షోభస్థితికి కారణమవుతున్నారని అధికారవర్గాలే వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంలో ప్రధానంగా ఏఎమ్మార్పీ, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు కల్వకుర్తి, రాజీవ్‌భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, అలీసాగర్, గుత్ప, చౌటుపల్లి హన్మంతరెడ్డి, దేవాదుల తదితర పంపింగ్ స్టేషన్లు అత్యంత కీలకం. ప్రధాన ఆయకట్టు ఆయా పంప్‌హౌస్‌ల దిగువనే ఉన్నది. ఇవిగాక అనేక లిఫ్ట్ స్కీమ్‌లు సైతం ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఆయా పంపింగ్ స్టేషన్లకు సంబంధించిన బిల్లులు విడుదల చేయడం లేదు. దీంతో సాగు, విద్యుత్తు సంక్షోభం మరింతగా ముదిరిపోయింది.
పేరుకుపోయిన బకాయిలు
విద్యుత్తు సరఫరాకు సంబంధించిన బిల్లులు రూ.27,027 కోట్లు, ఇప్పటికే పూర్తయిన లిఫ్ట్ స్కీమ్‌లకు సంబంధించిన పనులకుగాను రూ.863.51 కోట్లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి పంప్‌హౌస్‌ల నిర్మాణం, కరెంటు సరఫరా కోసం రూ.3,900.81 కోట్లతో మరికొన్ని బకాయిలు ఇలా మొత్తం కలిపి రూ.33,653 కోట్ల నిధులను ట్రాన్స్‌కోకు ఇరిగేషన్ శాఖ చెల్లించాల్సి ఉన్నది. పంపింగ్ స్టేషన్ల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్‌కు సంబంధించి రూ.1,800 కోట్ల బకాయిలున్నాయి. అందులో అత్యవసరంగానైనా కనీసం రూ.500 కోట్లను చెల్లించాలని ట్రాన్స్‌కో సుదీర్ఘకాలంగా ఇరిగేషన్ శాఖకు, ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నది.
అయినప్పటికీ, ప్రభుత్వం పెడచెవిన పెడుతుండటంతో బకాయిలిస్తే తప్ప కరెంటును ఇవ్వబోమని ఇరిగేషన్ శాఖకు ట్రాన్స్‌కో విభాగం గత సీజన్లోనే తెగేసి చెప్పింది. అనంతరం ప్రభుత్వ పెద్దల ఒత్తిడి, బిల్లుల చెల్లింపుపై హామీనివ్వడంతో 24 గంటలకు బదులు 12 గంటల పాటే, అదీ పగటిపూట మాత్రమే కరెంటు ఇచ్చేందుకు షరతుపై ఒప్పుకున్నది. గత సీజన్ నుంచే ఆ మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు పగటిపూట మాత్రమే విద్యుత్తును సరఫరా చేయడం ప్రారంభించింది. అయితే ఏడాది గడిచినా ప్రభుత్వం సదరు బిల్లులను ఇప్పటికీ చెల్లించలేదు. వెరసి ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ, లిఫ్ట్ పథకాలు నిర్దేశిత లక్ష్యంమేరకు నీటిని ఎత్తిపోయలేని దుస్థితి నెలకొన్నది. వెరసి పలు చోట్ల కీలక దశలో సాగునీరందక పంటలు ఎండిపోతున్న దుర్భర పరిస్థితి దాపురించింది.
బొగ్గు ఇవ్వని సింగరేణి
సాధారణంగా విద్యుత్తు ఉత్పత్తికి కావాల్సిన బొగ్గును సింగరేణి నుంచి జెన్కో తీసుకొంటుంది. విద్యుత్తును ఉత్పత్తి చేసి ట్రాన్స్‌కోకు ఇస్తుంది. ట్రాన్స్‌కో వినియోగదారులకు సప్లయ్ చేసి ఫీజులు వసూలు చేస్తుంది. ఇదొక గొలుసు. ప్రస్తుతం ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు బిల్లుల విడుదల నిలిపేసింది. దీంతో ట్రాన్స్‌కోకు చెల్లింపులు లేకుండా పోయాయి. వెరసి అది జెన్కోకు చెల్లించడం లేదు. ఆ సంస్థ సైతం సింగరేణికి భారీగా నిధుల బకాయి పడింది. వెరసి డిమాండ్ మేరకు బొగ్గు సప్లయ్‌ను సింగరేణి నిలిపేసింది.
ప్రస్తుతం జెన్కో ప్లాంట్లలో బొగ్గు కొరతకు నిధుల పెండింగే కారణమని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆయా సంస్థలు, శాఖలు ఎవరికి వారుగా నిధుల కోసం పట్టుబడుతున్నారు. దీనికితోడు సమన్వయం లోపించింది. దీనంతటికీ ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోవడం ప్రధాన వైఫల్యమని తెలుస్తున్నది. ఫలితంగా ఒకవైపు విద్యుత్తు సంక్షోభం.. తద్వారా ప్రస్తుతం నీటిసంక్షోభం తలెత్తిందని అధికారవర్గాలు వివరిస్తున్నాయి. ట్రాన్స్‌కో కేవలం ఉదయం పూట మాత్రమే విద్యుత్తును సరఫరా చేయడంతో పూర్తి సామర్థ్యం మేరకు పంపింగ్ స్టేషన్లను రన్ చేయని దుస్థితి నెలకొన్నది. తద్వారా పూర్తిస్థాయిలో ఎత్తిపోతలు కొనసాగట్లేదు. వెరసి రిజర్వాయర్లు వెలవెలబోతున్నాయి.
ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ట్రాన్స్‌కో తీరుపై ప్రభుత్వ పెద్దల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తూనే ఉన్నారు. ఆన్‌అండ్‌ఆఫ్ కాకుండా నిరంతరాయంగా కరెంటును ఇచ్చేలా చూడాలని మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇరిగేషన్, ట్రాన్స్‌కో అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలోనే ట్రాన్స్‌కో అధికారులు వెనక్కి తగ్గలేదు. బిల్లులు కోసం పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికీ మళ్లీ ఆ విషయంపై దృష్టి సారించిన పరిస్థితి లేదు. అలా మొత్తంగా ఇది ప్రభుత్వ పెద్దల పరిపాలన వైఫల్యానికి అద్దం పడుతున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే, ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా సర్కారు కండ్లు తెరవలేదు. శాఖలను సమన్వయం చేయలేదు. ఫలితంగా.. సాగు, తాగునీటి సంక్షోభం తలెత్తే ప్రమాదముంటుందని గతంలో నిపుణులు చేసిన హెచ్చరికలు ఇప్పుడు కండ్లముందు కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో సాగు, కరెంట్ సంక్షోభం
నిధుల విడుదల్లో కాంగ్రెస్ సర్కార్ జాప్యం
సర్కార్ నుంచి ఇరిగేషన్ శాఖకు సరిపడా విడుదల కాని నిధులు
రూ.33,653 కోట్ల మేర ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వనందుకు పాక్షికంగా కరెంట్ నిలిపేసిన ట్రాన్స్‌కో
తమకు రావాల్సిన మొత్తం బకాయిలు ఇవ్వకపోవడంతో ట్రాన్స్‌కోకు పూర్తిగా విద్యుత్తును ఇవ్వని జెన్కో
తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో జెన్కోకు తగినంతగా బొగ్గును సరఫరా చేయని సింగరేణి
సర్కార్ అసమర్థత, కీలక శాఖల మధ్య సమన్వయ లోపం, బకాయిల కోసం పంతం.. వెరసి సాగు, కరెంటు సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

