రజాక్ మంజిల్‌లో అప్రకటిత ఆంక్షలు
హైదరాబాద్ నాంపల్లిలోని ముస్లిం మైనారిటీల కార్యకలాపాల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ కార్యాలయమైన రజాక్ మంజిల్‌లో ఆంక్షలు విధించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భవనం గేటుకు తాళం వేయడం, లోనికి అనుమతించకపోవడంలోని మతలబు ఏందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
- గేటుకు తాళం.. రాకపోకలు బంద్
- మసీదుకు వెళ్లేందుకు ముస్లింల ఇక్కట్లు
- తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- అధికారులను అడిగితే దాటవేస్తున్న వైనం
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్ నాంపల్లిలోని ముస్లిం మైనారిటీల కార్యకలాపాల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ కార్యాలయమైన రజాక్ మంజిల్‌లో ఆంక్షలు విధించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు భవనం గేటుకు తాళం వేయడం, లోనికి అనుమతించకపోవడంలోని మతలబు ఏందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ, సెక్రటేరియట్‌లోకి వెళ్లేందుకు లేని ఆంక్షలు ఇక్కడే ఎందుకని మైనారిటీ సంఘాల బాధ్యులు ప్రశ్నిస్తున్నారు.
వక్ఫ్, ఉర్దూ అకాడమీ, మసీదులకు చెందిన స్థలాలు.. ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రల లోగుట్టు బట్టబయలవుతుందనే భవనంలోనికి అనుమతించడంలేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే అధికారులు ఈ వ్యవహారాన్ని రహస్యంగా నడుపుతున్నారని అంటున్నారు. ఇటీవల ఉర్దూ అకాడమీ భూము ల వేలం, రాయదుర్గం సర్వేనంబర్ 83/1లోని జామియా నిజామియా భూములు, మామిడిపల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లోని వక్ఫ్ స్థలాలను ప్రభుత్వం విక్రయానికి య త్నిస్తున్నదన్న విషయాలు బయటకు పొక్కిన నేపథ్యంలో అధికారులు జాగ్రత్త పడుతున్నారని పేర్కొంటున్నారు.
ముస్లిం మైనారిటీల ఇబ్బందులు
రజాక్ మంజిల్ భవన సముదాయంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు, హజ్ కమిటీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ యూనివర్సిటీ అకాడమీ సెంటర్, మైనారిటీ సంక్షేమ కార్యాలయాలతోపాటు మసీదు ఉన్నది. వివిధ పనుల కోసం నగరంతోపాటు జిల్లాల నుంచి నిత్యం వందలాది మంది ముస్లిం మైనారిటీలు వస్తుంటారు. భవన సముదాయంలోకి ఎవరినీ అనుమతించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మసీదులో నమాజ్ చేసేందుకు కూడా వెళ్లనీయడంలేదని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేయాలని ఇటీవల బీఆర్ఎస్ మైనారిటీ సెల్ బాధ్యులు వక్ఫ్ బోర్డు సీఈవో అసదుల్లాకు వినతిపత్రం అందజేశారు. అయినా ఆంక్షలు కొనసాగించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా యి.రజాక్ మంజిల్‌లో విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎస్డీ అక్బర్ హుస్సేన్, వక్ఫ్‌బోర్డు మాజీ మెంబర్ వహీద్ అహ్మద్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసనకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

