ఉచిత సలహాలతో పరిష్కారం దొరకదు
ఎల్ నినో తీవ్రతపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు జూన్‌లోనే స్పష్టమైన హెచ్చరికలు చేశారు. కానీ కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. రుతుపవనాల క్షీణత, ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి ప్రవాహాలు నిలిచిపోవడం వల్ల కృష్ణా, గోదావరి పరిధిలోని జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. తాగు, సాగునీటి సంక్షోభం తలెత్తింది. కరువును ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎత్తకుండా సర్కార్ నిర్లక్ష్యం వహించింది.
ఎల్ నినో తీవ్రతపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు జూన్‌లోనే స్పష్టమైన హెచ్చరికలు చేశారు. కానీ కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. రుతుపవనాల క్షీణత, ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి ప్రవాహాలు నిలిచిపోవడం వల్ల కృష్ణా, గోదావరి పరిధిలోని జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోయాయి. తాగు, సాగునీటి సంక్షోభం తలెత్తింది. కరువును ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎత్తకుండా సర్కార్ నిర్లక్ష్యం వహించింది. గోదావరి వరద నీటిని మళ్లించి, మల్లన్నసాగర్ సహా అనుసంధానిత జలాశయాల్లో నింపితే దుర్భిక్షాన్ని అధిగమించే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వ అలసత్వంతో తెలంగాణ కరువు కష్టాలను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా ఏం చేస్తే సమస్యను అధిగమించవచ్చో చూద్దాం.
కరువు విళయ తాండవం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయాన్ని కోరుతామని చెప్తున్నది. తాగునీటి సరఫరాకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి, రైతులు వరి పంట వేయకుండా చూస్తామని సెలవిస్తున్నది. అయితే వరితో పోల్చితే ఇతర పంటలకు ఆర్థికపరమైన రక్షణ లేదు. అందుకే రైతులు వరి సాగుకు మొగ్గు చూపుతుంటారు. ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక భరోసా ఇవ్వకుండా పంట మార్పిడి చేయాలని సూచించడం సరికాదు. నిర్దిష్ట నేల రకానికి సరిపోయే విత్తనాలు, ముందస్తు పెట్టుబడి లేదా ధరల గ్యారెంటీ ఇవ్వకుండా పప్పుధాన్యాలు, నూనెగింజలు సాగు చేయాలని ఉచిత సలహాలు ఇవ్వడం వల్ల రైతులకు ఉపయోగం లేదు.
అస్థిరమైన బహిరంగ మార్కెట్లలో ప్రైవేట్ వ్యాపారుల చేతిలో రైతులు మోసపోయే ప్రమా దం ఉన్నది. కాబట్టి, స్పష్టత లేని మార్గదర్శకాలను పక్కనబెట్టి, చట్టబద్ధమైన రక్షణ కలిగిన నూ తన విధానాన్ని, సహకార నమూనాను అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. వాతావరణ మా ర్పులను తట్టుకునే నిజమైన స్థిరత్వం రావాలంటే, ప్రభుత్వం పంట మార్పిడిలోని ఆర్థిక నష్టాన్ని భరించాలి. ఇందుకోసం మండలాల వారీగా ప్యాకేజీలను అమలు చేయాలి. ఈ నూ తన విధానం ప్రకారం స్థానిక నేల రకాలు, భూ గర్భ జలాల లభ్యత ఆధారంగా ఏ పంటలు సాగు చేయాలో గుర్తించాలి. వ్యవసాయ శాఖ, జాతీయ మృత్తిక సర్వే భూవినియోగ ప్రణాళిక బ్యూరో, భూగర్భ జల శాఖల సమన్వయంతో మొత్తం 621 మండలాలను వర్గీకరించి, అందు లో కరవు పీడిత ప్రాంతాలుగా ప్రకటించిన 365 మండలాలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలి.
రైతులకు తమ పొలాల్లో మృత్తిక ఆధారంగా సాయిల్ హెల్త్ కార్డులు, డిజిటల్ పాస్‌బుక్‌లను ఇవ్వాలి. ఒక నిర్దిష్టమైన పంట కోడ్ కేటాయించాలి. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన సబ్సిడీలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. చిన్న, సన్నకారు రైతులు పంట మార్చడానికి భయపడటానికి ప్రధాన కారణం తక్షణ పెట్టుబడి కొరతే.
ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుత రైతు భరోసాకు అదనంగా పంట మార్పిడి సాయాన్ని అందించాలి. రైతులు విత్తనాలు వేసే సమయానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా 15 రోజుల ముందే 60% నగదును రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. మిగిలిన 40% నిధులను పంట వేసిన 30 రోజుల తర్వాత విడుదల చేయాలి. రాష్ట్రంలోని 2,600 పైగా ఉన్న రైతు వేదికలను విత్తనాలు, సాగు పరికరాలను అందిం చే సహాయ కేంద్రాలుగా మార్చాలి. రైతులు మార్కెట్లో ఖరీదైన విత్తనాలు కొని, ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలి. పంట నమోదు కాగానే, రైతులకు డిజిటల్ కూపన్ ఇవ్వాలి. దీనిని స్థానిక రైతు వేదిక వద్ద చూపిస్తే విత్తనాలు పంపిణీ చేయాలి.
అనూహ్యమైన వాతావరణ మార్పులను డిజిటల్ నెట్వర్క్ ద్వారా ముందే అంచనా వేసి, స్మార్ట్ ఇరిగేషన్, సోలార్ ప్రిసిషన్ అగ్రికల్చర్ పద్ధతులను రైతులు అలవర్చుకున్నారు. రెండేండ్లలోనే పంట పెట్టుబడులు తగ్గి, ప్రతికూల వాతావరణంలోనూ పంటలు దెబ్బతినకుండా అధిక దిగుబడితో ఆర్థిక స్వావలంబన సాధించారు. జర్మనీ ఆగ్రో టెక్నికా 2025 అంతర్జాతీయ వేదికపై మన రైతులు ప్రదర్శించిన ఈ వాతావరణ స్థిరత్వం నమూనా, భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి వినియోగించుకోవచ్చు.
ప్రభుత్వం చట్టబద్ధమైన తెలంగాణ ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు బోర్డును ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరపై అదనంగా 120% ప్రీమియం ధరతో కొనుగోలు చేసేలా నిబంధన విధించాలి. పంట తూకం వేసిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలి. ప్రభుత్వ రక్షణ వలయంతోపాటు, స్థానిక స్థాయిలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల భాగస్వామ్యంతో కమ్యూనిటీ ఆధారిత ఉత్పత్తి నమూనాను నిర్మించాలి.
ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నీటి కొరత వల్ల వరి సాగు పడిపోయినప్పుడు మార్కెట్ సరఫరా తగ్గి ధరలు ఎలా పెరుగుతాయో వేయొచ్చు. కూరగాయల మార్కెట్ కూడా ఇటువంటి వాతావరణ మార్పుల ముప్పునకు గురవుతున్నది. కాబట్టి, ఎఫ్‌పీవోలు, పీఏసీఎస్‌ల ద్వారా తక్కువ నీటితో, స్వల్ప కాలంలో పండే కూరగాయ పంటలను సాగు చేయించాలి.
ఇలా చేయడం వల్ల గ్రామీణ కుటుంబాలకు తక్కువ ధరకే తాజా కూరగాయలు లభిస్తాయి. మార్కెట్ ద్రవ్యోల్బణం నుంచి ప్రజలు రక్షణ పొందుతారు. రైతులకు కూడా మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ లాభాలు పూర్తిగా రైతులకు చేరాలంటే దళారీ వ్యవస్థను రూపుమాపాలి. ఇందుకోసం మార్కెటింగ్‌శాఖ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్లలో రిజిస్టర్డ్ ఎఫ్‌పీవోలు, పీఏసీఎస్‌లకు ఉచిత స్టాళ్లను కేటాయించాలి. రైతులకు రవాణా ఖర్చుల భారం తగ్గించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కోనరావుపేట ప్రాంతాల్లో చేపట్టిన వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ సమతుల్యత లక్ష్యంగా చేపట్టిన ఇండో-జర్మన్ ప్రాజెక్టు సత్ఫలితాలు సాధించింది.
వాతావరణ మార్పులను ఎదుర్కొంటూ వాతావరణ స్థిరత్వం ఎలా పెంపొందించుకోవచ్చో స్థానికులు నిరూపించారు. మంగళ్లపల్లి, రామయ్యపేట్, నాగారం వంటి పైలట్ గ్రామాల్లోని రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా వెదర్ ఎక్స్, ట్రాప్ స్నాప్ వంటి కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతలను నేరుగా వ్యవసాయ క్షేత్రాల్లోకి తీసుకెళ్లారు.
అనూహ్యమైన వాతావరణ మార్పులను డిజిటల్ నెట్వర్క్ ద్వారా ముందే అంచనా వేసి, స్మార్ట్ ఇరిగేషన్, సోలార్ ప్రిసిషన్ అగ్రికల్చర్ పద్ధతులను రైతులు అలవర్చుకున్నారు. రెండేండ్లలోనే పంట పెట్టుబడులు తగ్గి, ప్రతికూల వాతావరణంలోనూ పంటలు దెబ్బతినకుండా అధిక దిగుబడితో ఆర్థిక స్వావలంబన సాధించారు. జర్మనీ ఆగ్రో టెక్నికా 2025 అంతర్జాతీయ వేదికపై మన రైతులు ప్రదర్శించిన ఈ వాతావరణ స్థిరత్వం నమూనా, భవిష్యత్తులో తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి వినియోగించుకోవచ్చు.ప్రభుత్వం కరువు వచ్చినప్పుడు స్పందించే తీరు మార్చుకోవాలి. వాతావరణ మార్పులను ముందస్తుగానే అంచనా వేయాలి. హె చ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలి. కరువు పరిస్థితుల్లో చేతులెత్తేయకుండా వ్యూహాలను అమలు చేయాలి. నిర్మాణాత్మక సవాళ్లను ధైర్యంగా స్వీకరించాలి. నిపుణుల హెచ్చరికలను లెక్కచేయకుండా కరువును తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం, కచ్చితమైన విధానాలతో కరువు నుంచి రైతులను కాపాడాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే)
డాక్టర్ చెన్నమనేని రమేశ్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

