KCR | కేసీఆర్ భద్రత కుదింపు.. ఎస్కార్ట్ వాహనం.. ఇంటిముందు సెంట్రీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు భద్రత కుదిస్తున్నట్టు రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. కేటీఆర్, హరీశ్‌రావు సహా గెలిచిన మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతనే ఇచ్చినట్టు తెలిసింది. మాజీ సీఎం, క్యాబినెట్ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు ప్రస్తుతం ‘వై’ క్యాటగిరీ భద్రతను కేటాయించినట్టు సమాచారం.
- పదేండ్ల సీఎంకు కేవలం ‘వై’ క్యాటగిరీ భద్రత?
- నాయకుడికి కేవలం ‘వై’ క్యాటగిరీ భద్రత?
- కేటీఆర్, హరీశ్, మాజీ మంత్రులకు 2+2
- మాజీ ఎమ్మెల్యేల నుంచి గన్‌మెన్ వాపస్
- భద్రత ముప్పులేదని పోలీసుశాఖ అంచనా
KCR | హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు భద్రత కుదిస్తున్నట్టు రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. కేటీఆర్, హరీశ్‌రావు సహా గెలిచిన మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతనే ఇచ్చినట్టు తెలిసింది. మాజీ సీఎం, క్యాబినెట్ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు ప్రస్తుతం ‘వై’ క్యాటగిరీ భద్రతను కేటాయించినట్టు సమాచారం. థ్రెట్ పర్సప్షన్ రేట్(టీపీఆర్)కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాజీ మంత్రులకు కూడా 2+2 భద్రతను కొనసాగిస్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ భద్రతను పూర్తిగా తీసివేశారు. ఇటీవల ప్రజాప్రతినిధుల భద్రతపై ఇంటెలిజెన్స్‌శాఖ సమీక్ష నిర్వహించి.. మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ప్రాణహాని, ఇతరుల నుంచి ముప్పుగానీ లేదని అం చనాకు వచ్చి వారి భద్రత తొలగించింది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి గన్మెన్లను రీకాల్ చేశారు.
ఎస్కార్ట్ వాహనం.. ఇంటిముందు సెంట్రీ
కేసీఆర్‌కు ‘వై’ క్యాటగిరీ భద్రత ఇచ్చినట్టు తెలిసింది. ఆయన వెంట నిత్యం నలుగురు భద్రతా సిబ్బంది, ఎస్కార్ట్, పైలట్ వాహనాలు ఉంటాయి. పదేండ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ‘నోన్ సోర్స్’ నుంచి లేదా ‘అన్నోన్ సోర్స్’ నుంచి ప్రమాదం పొంచి ఉం డొచ్చు. కేసీఆర్ భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ ఇంటి ముందు ఓ సెంట్రీతో పా టు మరో ఇద్దరిని భద్రతగా ఉంచే అవకాశం ఉన్నది. మావోయిస్టులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నేటి కీ పోస్టర్లు విడుదల చేస్తున్నా భద్రతను తగ్గించటం అనుమానాలను రేకెత్తిస్తున్నది. ప్రస్తుతం కేసీఆర్ తుంటి సర్జరీతో యశోద దవాఖానలో చికిత్స పొం దుతున్నారు. ఆరోగ్యం మెరుగైన వెంటనే ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు. ఆయన భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం మరోసారి పునరాలోచించాలనే డిమాండ్ వినిపిస్తున్నది. కేసీఆర్‌కు ఏ తరహా క్యాటగిరీ భద్రత కేటాయించారో ఇప్పటివరకు చెప్పలేదు.
ప్రస్తుతం 2+2 మాత్రమే
ఐటీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కేటీఆర్‌కు సైతం సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన భద్రతనే కేటాయించారు. హరీశ్‌రావుకూ 2+2 భద్రత ఇచ్చారు. ఓ సెలబ్రిటీగా, బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు ఎమ్మెల్యేలతో సమానంగా భద్రత ఇవ్వటంపై పార్టీశ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతున్నది. గురువారం వరకు మాజీ మం త్రులకు 2+2 భద్రత ఉన్నదని, సాయంత్రం నుంచి వారిని కూడా వాపస్ తీసుకున్నారని తెలిసింది. మా జీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల గన్మెన్లను వాపస్ తీసుకోవాలని జిల్లాల యంత్రాంగానికి అడిషనల్ డీజీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేల భద్రతపై ఐఎస్డ బ్ల్యూ మరోసారి సమీక్షించనున్నట్టు తెలిసింది. ప్ర మాద ముప్పును అంచనా వేసి, భద్రత పెంచాలా? లేదా? అనేది నిర్ణయించనున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు యథావిధిగా భద్రత కొనసాగనున్నది. బీజేపీ నుంచి రాజాసింగ్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీకి భద్రతను కొనసాగిస్తారని సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- harish rao
- KCR
- KTR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

