EAMCET Exams | ప్రశాంతంగా తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్.. ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు పూర్తి
EAMCET Exams | తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 14 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కు సంబంధించిన పరీక్షలు జరిగాయి.
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఈ నెల 14 వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌కు సంబంధించిన పరీక్షలు జరిగాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించారు.
తెలంగాణలో 95 కేంద్రాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో 18 కేంద్రాల్లో తొలిరోజు ఎంసెట్ పరీక్షలు జరిగాయి. తెలంగాణలో ఈ పరీక్షల కోసం 47,177 మంది రిజస్టర్ చేసుకోగా.. 43,766 మంది హాజరయ్యారు. మొత్తం 92.76 శాతం హాజరు నమోదైంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 10,401 మంది రిజస్టర్ చేసుకోగా 9,089 మంది (87.38 శాతం) హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ పరీక్షకు 91.79 శాతం హాజరు నమోదైంది.
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి హైదరాబాద్ నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. కాగా ఇవాళ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో పరీక్షలు పూర్తికాగా.. రేపు మెడికల్ స్ట్రీమ్‌లో, 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

