పోలీసులకే ప్రజల కన్నీళ్లు తుడిచే అవకాశం
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ.. ప్రజల అత్యవసర సేవల కోసం తెలంగాణ పోలీసు వ్యవస్థలో 112 సేవలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు 112 మంది డీఎస్పీలు ప్రజాసేవలోకి అడుగుపెట్టడం విశేషమని పేరొన్నారు. వీరిలో 74 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నట్టు చెప్పారు.
- పోలీసు యూనిఫాం ధరించడం గొప్ప అదృష్టం
- నేరాల తీరు మారింది కాబట్టి పోలీసింగ్ మారాలి
- 112 మంది డీఎస్పీల పాసింగ్ అవుట్ పరేడ్‌లో డీజీపీ
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : పోలీసు యూనిఫాం ధరించడం గొప్ప అదృష్టమని, ప్రజలకు సేవ చేయడంతోపాటు వారి ప్రాణాలను కాపాడే, ఆపదల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడిచే అరుదైన అవకాశం పోలీసు శాఖలో పనిచేసేవారికి లభిస్తుందని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. తెలంగాణలోని నాలుగు కోట్ల జనాభాలో సుమారు 90 వేల మందికే పోలీసు యూనిఫాం ధరించే అవకాశం ఉన్నదని వివరించారు. ప్రతిరోజూ కనీసం 50 మంది కన్నీళ్లు తుడిచే అవకాశం పోలీసులకు లభిస్తుందని పేరొన్నారు. నిజాయితీ, నైతిక విలువలను విస్మరించరాదని, కుల, మత, రాజకీయ రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న 112 మంది డీఎస్పీల పాసింగ్ఔట్ పరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పోలీసింగూ మారాలి
తాము యూనిఫాం ధరించిన రోజుల్లో నక్సలిజం ప్రధాన సవాల్‌గా ఉండేదని, నాడు పోలీసులు సమర్థవంతంగా ఎదురొన్నారని డీజీపీ గుర్తుచేశారు. ప్రస్తుతం సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలు, రోడ్డు భద్రత, ఇతర సవాళ్లు పోలీసుల ముందున్నాయని తెలిపారు.
74 మంది పురుషులు, 38 మంది మహిళలు
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్ మాట్లాడుతూ.. ప్రజల అత్యవసర సేవల కోసం తెలంగాణ పోలీసు వ్యవస్థలో 112 సేవలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు 112 మంది డీఎస్పీలు ప్రజాసేవలోకి అడుగుపెట్టడం విశేషమని పేరొన్నారు. వీరిలో 74 మంది పురుషులు, 38 మంది మహిళలు ఉన్నట్టు చెప్పారు. వీరిలో కొత్తగా ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్నవారు 55 మంది ఉన్నట్టు వివరించారు. ఎస్సైలుగా పనిచేసిన నలుగురు ప్రస్తుతం డీఎస్పీలుగా ఎంపికయ్యారన్నారు. పోలీస్ శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నేహా అగర్వాల్ ముఖ్యమంత్రి రివాల్వర్‌తో పాటు మరో మూడు పురసారాలను అందుకున్నారు. పరేడ్ కమాండర్‌గా, బెస్ట్ ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్కు సీఎం రివాల్వర్, రాజాబహదూర్ వెంకటరామారెడ్డి బంగారు పతకం, కోన రామచంద్రారెడ్డి స్మారక బంగారు పతకం, ఇండోర్ సబ్జెక్టుల్లో ప్రతిభకు హోంమంత్రి బేటన్ ఆమెకు లభించాయి. ఇతర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారిలో ఔట్‌డోర్ సబ్జెక్టుల్లో ఎల్ శ్రీకాంత్ డీజీపీ ట్రోఫీ, ఫైరింగ్‌లో టీ జాకబ్ అభిషేక్ ఉత్తమ పురసారం అందుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్‌లో డీ చందన, క్రిమినాలజీలో ఆదిశేషురెడ్డి ఎన్‌ఐసీఎఫ్‌ఎస్ పతకాలు సాధించారు. దర్యాప్తులో ఉత్తమ ప్రతిభకు ఆర్ సాయి కిరణ్‌రెడ్డి డైరెక్టర్ పతకాన్ని దకించుకున్నారు.
తండ్రి నుంచే తొలి సెల్యూట్!
2025 బ్యాచ్‌లో డీఎస్పీగా శిక్షణ పూర్తిచేసుకున్న సాయివిశ్వంత్ తొలి సెల్యూట్‌ను తన తండ్రి నుంచే స్వీకరించారు. డీఎస్పీ హోదా లో ఉన్న తన కుమారుడికి ఎస్సైగా వీరేశం సెల్యూట్ సార్ అంటూ వందనం చేశారు.

వీరేశం ప్రస్తుతం నార్సింగిలో ఎస్ఐ (క్రైం)గా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులకు డీఎస్పీ కుమారుడి తొలి సెల్యూట్.. పోలీసు కుటుంబంలో పుత్రోత్సాహం వెల్లివిరిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

