Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) అధ్యక్షతన ప్రగతి భవన్( Pragathi Bhavan ) లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు హాజరు కానున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి మంత్రి మండలి నిర్ణయాలు తీసుకోనుంది.