హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఎప్పటికీ గ్లోబల్ కాస్మోపాలిటన్ నగరమేనని లండన్ మేయర్ అభ్యర్థి తరుణ్ గులాటీ చెప్పారు. వచ్చే ఏడాది జరిగే లండన్ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలబడిన భారత సంతతికి చెందిన ఆయన.. హైదరాబాద్ నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఎన్నో గొప్ప నగరాల తరహాలో సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం ఉన్న హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని కొనియాడారు. చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ప్రచారం మొదలుపెట్టినట్టు చెప్పారు.