T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
T Square | కాంగ్రెస్ ప్రభుత్వం రాయదుర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపె ట్టిన టీస్క్వేర్ ఏడాది పూర్తి కావస్తున్నా పట్టాలెక్కడం లేదు. గతేడాది నవంబరులోనే పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిం చినా.. పనులు మొదలు కాకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
T Square | ‘సోషల్ మీడియా యుగంలో హైదరాబాద్‌ను ఒక డిజిటల్ కాన్వాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీస్క్వేర్ నిర్మాణానికి అత్యు త్తమ ప్రమాణాలతో, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా డిజైన్లు పరిశీలించి అధికారులు ఆమోదించాలి. దీన్ని వినోదం, పర్యాటకం, ఆహారం, వ్యాపార కూడలిగా రూపొందించాలి. 24 గంటల పాటు సందర్శ కులను ఆకర్షించాలి. పెద్ద ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, డిజిటల్ ప్రకటనలతో ప్రపంచ స్థాయి డిజిటల్ డిస్ప్లే ఎలివేషన్‌గా ఈ కట్టడాన్ని తీర్చిదిద్దాలి. టీస్క్వేర్ భవనంలో యాపిల్ వంటి ప్రపంచస్థాయి బ్రాండ్లు తమ అవుట్లెట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.’
– ఇవి గతేడాది అక్టోబర్‌లో టీస్క్వేర్ అభివృద్ధి ప్రణాళికపై ఏర్పాటు చేసిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం రాయదుర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపె ట్టిన టీస్క్వేర్ ఏడాది పూర్తి కావస్తున్నా పట్టాలెక్కడం లేదు. గతేడాది నవంబరులోనే పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిం చినా.. పనులు మొదలు కాకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
ఐటీ హబ్ విరాజిల్లుతున్న రాయదుర్గంలో ప్రజలు సేద తీర డంతో పాటు వ్యక్తులు, సంస్థల మధ్య కమ్యూనికేషన్‌కు వారధిగా ఈ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావించింది. రోజంతా పని ఒత్తిడిలో ఉన్న జనానికి ఊరటనిచ్చే రీక్రియేషన్ హబ్, వేడుకలు చేసుకునే వేదికగా, వ్యాపార కేంద్రంగా టీ స్క్వేర్ను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణం చేపడతామని కాంగ్రెస్ సర్కార్ ఊదరకొట్టింది. అమెరికా న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ తరహాలో నిర్మాణం చేపడతామని గొప్పలకు పోయింది. అయితే ఏడాది పూర్తి కావ స్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పనులు ప్రారంభించకపోవడం.. ఐటీ రంగంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నది. ఐటీ సంస్థలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార కార్యకలాపాలకు ఊతమిచ్చేందుకు తలపెట్టిన ఈ ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ఏడాదైనా మోక్షం లభించడం లేదనే విమర్శలున్నాయి.
టీస్క్వేర్లో ఏర్పాటు చేసే వీడియో బిల్ బోర్డు లతో ప్రకటనలు, వచ్చి పోయే పర్యాటకులతో ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించింది. ప్రాజెక్టు అమలు బాధ్యతలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగిం చింది. అయితే గతేడాది నవంబర్‌లో ప్రారం భించాలని సీఎం ఆదేశించినా.. ప్రాజెక్టు పనుల ప్రారంభం విషయంలో ఎలాంటి పురోగతి లేదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జోరం దుకుంది. బీఆర్ఎస్ హయాంలో టీహబ్, వీహబ్, టీఎస్ఐసీ, టాస్క్, రిచ్, టీ వర్క్స్, తెలంగాణ ఇన్నోవేషన్ నెట్వర్క్ తదితర ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసి ఐటీ పురోగ తిని కొత్త శిఖరాలకు చేర్చగా.. కాంగ్రెస్ చేప ట్టిన ఒక్క ప్రాజెక్టును సైతం పట్టాలెక్కించక పోవడం గమనార్హం. ఐటీ రంగానికి ఊత మిచ్చే ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడం పట్ల ఐటీ రంగ నిపుణులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే టీస్క్వేర్ పనులను ప్రారంభించాలని వారు కోరుతున్నారు. give me
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
Rajinikanth | రూ.600 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. 40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
Water Wastage | నీళ్లు వృథా చేసే ట్యాంకర్లకు 5 వేలు జరిమానా.. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు.. జలమండలి ఎండీ వార్నింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని కన్నీళ్లు.. హౌస్ గేట్లు తెరిచిన నాగార్జున, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో షాక్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

