Water Wastage | నీళ్లు వృథా చేసే ట్యాంకర్లకు 5 వేలు జరిమానా.. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు.. జలమండలి ఎండీ వార్నింగ్
Water Wastage | నీటిని వృథా చేసే ట్యాంక ర్లకు రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు జలమండలి ఎండీ అశోత్రెడ్డి హెచ్చరించారు. ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు నూతన మార్గ దర్శకాలు జారీ చేశారు.
Water Wastage | సిటీబ్యూరో, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): నీటిని వృథా చేసే ట్యాంక ర్లకు రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు జలమండలి ఎండీ అశోత్రెడ్డి హెచ్చరించారు. ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు నూతన మార్గ దర్శకాలు జారీ చేశారు. ఈమేరకు ట్యాంకర్లు నీటి సరఫరా సమయంలో వృథాను నివారించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలని జలమం డలి ఎండీ అశోత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
నీటి ట్యాంకర్లలో సామ ర్థ్యానికి మించి నీటిని నింపడం, మూతలు లేకుండా నీటి రవాణా చేయడం వల్ల వృథాగా పోతున్నట్లు గుర్తించారు. దీని వల్ల తాగునీరు వృథాగా పోతుండటంతో పాటు రోడ్లపై వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈనేప థ్యంలో ట్యాంకర్లలో నీటిని నింపేటప్పుడు, రవాణా సమయంలో పాటించాల్సిన నిబంధనలు అమలు చేయడాలని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల జీఎం లను ఆదేశించారు.
నిబంధనలు పాటించని ట్యాంకర్లకు నవంబర్ 1 నుంచి రూ.5 వేల జరిమానాలు విధిస్తామని ప్రకటించారు. అయినా పునరావృతం చేస్తే ట్యాంకర్ జి స్ట్రేషన్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రవాణా సమయంలో నీటి వృథా జరగకుండా ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు బాధ్యగా వహించాలని సూచించారు.
ఫిల్లింగ్ స్టేషన్లలో పర్యవేక్షణ
జలమండలి పరిధిలోని అన్ని ఫిల్లింగ్ స్టేషన్ల మేనేజర్లు, ఇన్చార్జీలు ఈనిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఎండీ ఆదేశించారు. టాంకర్లలో నీటిని నింపే ముందు లీకేజీలు, మూతల పరిస్థితిని పరిశీలించాలని, లోపాలు గుర్తిస్తే వాటిని సరిచేసే వరకు నీటిని నింపేందుకు అనుమతులు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. మార్గదర్శకాల అమలును డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ట్యాంకర్ అసోసియేషన్లు సైతం తమ సభ్యులకు నిబంధనలపై అవగాహన కల్పించి, నీటి వృథాను అరికట్టేందుకు తోడ్పాటును అందించాలని కోరారు. నీటి పొదుపు విష యంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని, మార్గదర్శకాలను సంబంధిత అధికా రులు, ట్యాంకర్ నిర్వాహకులు పాటించాలని జలమండలి ఎండీ సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Water Wastage | నీళ్లు వృథా చేసే ట్యాంకర్లకు 5 వేలు జరిమానా.. పునరావృతమైతే రిజిస్ట్రేషన్ రద్దు.. జలమండలి ఎండీ వార్నింగ్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని కన్నీళ్లు.. హౌస్ గేట్లు తెరిచిన నాగార్జున, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో షాక్!
Arunachal Pradesh | అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్.. హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ!
Medigadda | నిరంతరం జలతరంగం.. మేడిగడ్డ వద్ద 20 వేల క్యూసెక్కుల ప్రవాహం
Jagadish Reddy | కన్నెపల్లికి పోదామా.. పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. జగదీశ్ రెడ్డి సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

