స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మనమే టాప్
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం అసాధారణ ప్రగతిని కనపర్చింది. తెలంగాణలోని పల్లెలు, జిల్లాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. దేశంలోని టాప్-10 జిల్లాల్లో 6, టాప్-25 జిల్లాల్లో 15 తెలంగాణవే. మొత్తంగా తెలంగాణలోని 32 జిల్లాలు టాప్-51లో నిలిచాయి.
- టాప్ 51 జిల్లాల్లో 32 మనవే
- సర్వేలో తెలంగాణకు సగటున 98.62 శాతం మార్కులు
- రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా.. ఏడాదంతా స్వచ్ఛమైన నీరు
- 99.8% ఇండ్లకు మరుగుదొడ్లు.. కేంద్ర ప్రభుత్వ సర్వే వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రం అసాధారణ ప్రగతిని కనపర్చింది. తెలంగాణలోని పల్లెలు, జిల్లాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. దేశంలోని టాప్-10 జిల్లాల్లో 6, టాప్-25 జిల్లాల్లో 15 తెలంగాణవే. మొత్తంగా తెలంగాణలోని 32 జిల్లాలు టాప్-51లో నిలిచాయి. ఈ జాబితాలో తమిళనాడు మినహా దక్షిణాది రాష్ర్టాల్లోని ఏ జిల్లాకూ చోటు లభించకపోవడం గమనార్హం. తమిళనాడు నుంచి ఒక్క జిల్లా మాత్రం 40వ ర్యాంకు సాధించింది. గాంధీ జయంతి సందర్భంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో స్వచ్ఛ సర్వేక్షణ్ పూర్తి నివేదికను వెల్లడించారు. తెలంగాణలోని గ్రామాల పనితీరు అత్యుత్తమంగా ఉన్నట్టు ఈ నివేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది.
నివేదికలోని అంశాలు
- స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేకు గ్రామాల వివరాలను ర్యాండమ్‌గా ఎంపిక చేస్తారు. ఏ గ్రామంలో ఏ రోజు సర్వే చేస్తారన్న విష యం సర్వే బృందానికి, సర్పంచ్‌కి మాత్రమే తెలుస్తుంది. అదీ సర్వే రోజునే.
- దేశవ్యాప్తంగా 709 జిల్లాల్లోని 17,559 గ్రామాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే చేశారు. రాష్ట్రంలో గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 32 జిల్లాల్లో 724 గ్రామాల్లో 7,240 మందితో నేరుగా మాట్లాడి అభిప్రాయాలను సేకరించారు.
- సర్వేలో తెలంగాణ సగటున 98.62% మార్కులు సాధించింది. వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన వ్యవస్థ, పెద్ద సంఖ్య లో వాహనాలుండటం సహా ఇంటింటి నుంచి వ్యర్థాలను సేకరించేందుకు విస్తృ త ఏర్పాట్లున్న రాష్ట్రంగా 99.9% మార్కులతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వర్మీ కంపోస్ట్ తయారీలోనూ 99.2% మార్కులతో ముందున్నది.
- తెలంగాణలో 99.8% ఇండ్లకు మరుగుదొడ్లు ఉన్నట్టు సర్వే వెల్లడించింది.
100% ఇండ్లకు భగీరథ కనెక్షన్లు
- మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో 100 శాతం ఇండ్లకు నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్టు కేంద్ర సర్వే వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి ఏప్రిల్ 10 వరకు ఈ సర్వే నిర్వహించారు.
- రాష్ట్రంలోని 409 గ్రామాల్లో 12,570 ఇండ్లను సర్వే చేసిన జల్ జీవన్ మిషన్ అధికారులు.. క్వాలిటీ, క్వాంటిటీ, రెగ్యులారిటీలో తెలంగాణ 92 శాతానికిపైగా మార్కులు సాధించినట్టు పేర్కొన్నారు.
- రాష్ట్రంలో ఏడాది పొడవునా రోజూ తాగునీరు సరఫరా అవుతున్నట్టు తేల్చింది.
- క్రమం తప్పకుండా తాగునీరు అందుతున్నదని తెలంగాణలో 98% మంది, దేశవ్యాప్తంగా 83% మంది సంతృప్తి వ్యక్తం చేసినట్టు ఈ నివేదిక పేర్కొన్నది.
- నల్లానీటితో రోజువారీ అవసరాలు తీర్చుకొంటున్న కుటుంబాలు రాష్ట్రంలో 99% దేశవ్యాప్తంగా 80% ఉన్నట్టు తేల్చింది.
- తాగునీటిని పట్టుకోవడానికి సమయం తగ్గిందని రాష్ట్రంలో 93%, దేశవ్యాప్తంగా 79% మంది చెప్పినట్టు పేర్కొన్నది.
- నల్లా కనెక్షన్లతో తమకు ఆర్థిక భారం తగ్గిందని తెలంగాణలో 93% మంది చెప్పినట్టు వెల్లడించింది.
- దీని ద్వారా తెలంగాణలోని గ్రామాల్లో పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య 9% పెరిగినట్టు సర్వే స్పష్టం చేసింది.
చిన్న వయస్సు ఉత్తమ పనితీరు: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): కొత్త బెంచ్ మార్క్‌ను సెట్ చేయడంలో తెలంగాణ దేశానికి స్ఫూర్తి నిస్తున్నదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ చిన్న వయస్సు రాష్ట్రమైనా.. దేశంలోనే ఉత్తమ పనితీరును కనబర్చిందని తెలిపారు. మిషన్ భగీరథ, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డులు లభించిన నేపథ్యంలో దార్శనికత కలిగిన సీఎం కేసీఆర్‌కు వందనాలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

