TAUK | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన కార్యవర్గాన్ని సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ప్రకటించారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ సంస్థను ముందుకు నడిపిస్తున్న సంస్థ ముఖ్య సలహాదారులు తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్దా రెడ్డికి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ కట్టా శేఖర్ రెడ్డికి రత్నాకర్ కడుదుల ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.
నాటి తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ఎన్నో రకాలుగా తెలంగాణ సమాజానికి సేవ చేస్తున్న ఎంతో మంది కార్యవర్గంలో ఉన్నారని, కేవలం లండన్ వరకే పరిమితం కాకుండా యూకే నలుమూలల సంస్థ కార్యకలాపాల్ని విస్తరించామని, అలాగే దానికి అనుగుణంగా ప్రతినిధులని నియమించామని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలతో పాటు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ టాక్ సంస్థ ప్రవాసుల్లో మంచి ఆదరణను గౌరవాన్ని సంపాదించుకుందని, అదే స్పూర్తితో నూతన కార్యవర్గం మరింత ఉత్సాహంతో పని చేస్తుందని రత్నాకర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చెయ్యాలనే సంకల్పంతో మా లాంటి ఎంతో మందిని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవిత సూచనలను సలహాలను సైతం తీసుకొని పని చేస్తున్నామని రత్నాకర్ తెలిపారు.
సంస్థ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం, ఇతర కోర్ కమిటీ సభ్యులు అశోక్ దూసరి, నవీన్ రెడ్డిల ప్రత్యేక పర్యవేక్షణ – సలహాలతో సంస్థ ఆశయాలను ఆలోచనలను నూతన కార్యవర్గం ముందుకు తీసుకెళ్తుందని రత్నాకర్ తెలిపారు. తెలంగాణను అన్ని వేదికల్లో ప్రాతినిధ్యం వహిస్తూ నిర్విరామంగా అన్ని రకాల అధికారిక కార్యక్రమాలల్లో సైతం తెలంగాణకు చిరునామాగా టాక్ సంస్థ నిలిచిందని తెలుపుటకు గర్విస్తున్నామని, అలాగే ఎన్ని కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని రత్నాకర్ కడుదుల తెలిపారు.
టాక్ నూతన కార్యవర్గ వివరాలు 2025-27
వ్యవస్థాపకుడు-అనిల్ కుర్మాచలం
మాజీ అధ్యక్షురాలు-పవిత్రారెడ్డి కంది
అధ్యక్షుడు-రత్నాకర్ కడుడుల
సలహా మండలి చైర్మన్ – మాట్టా రెడ్డి వంటేడు
సలహా మండలి వైస్ చైర్మన్(లు)- వెంకట్ రెడ్డి దొంతుల & గణేష్ పాస్తం
సలహా మండలి సభ్యులు – సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ వీర, శ్రీధర్ రావు తక్కలపెల్లి, స్వాతి బుడగం, సెరు సంజయ్, జాహ్నవి ధూసరి & వేణు నక్కిరేడ్డి
ఉపాధ్యక్షులు – శుష్మున రెడ్డి , సురేష్ బుడగం & రాకేశ్ పటేల్
ప్రధాన కార్యదర్శి (లు) – శ్రీకాంత్ జెల్ల, సుప్రజ పులుసు & సత్యపాల్ రెడ్డి పింగిలి
నేషనల్ కన్వీనర్(లు) – అశోక్ కుమార్ ధూసరి & నవీన్ రెడ్డి
కమ్యూనిటీ వ్యవహారాల చైర్పర్సన్ – గణేష్ కుప్పాల
కమ్యూనిటీ వ్యవహారాల వైస్ చైర్మన్(లు) – శ్వేతా మహేందర్ & బీరం మల్లా రెడ్డి
కార్యదర్శి (లు) – మధుసూదన్ రెడ్డి , క్రాంతి రేటినేని
జాయింట్ సెక్రటరీ – రాజేష్ వాకా , రంజిత్ చాతరాజ్ & శశిధర్ రెడ్డి డోడిల్
ఈవెంట్స్ & కల్చరల్ ఇన్ఛార్జ్ – సత్య చిలుముల & శైలజ జెల్లా
అధికారిక ప్రతినిధి – రవి రేటినేని & స్నేహలతా రెడ్డి, హరిబాబు గౌడ్ నవాపేట, మధుసూధన్ రెడ్డి, రాజేష్ వాకా, శ్రీ విద్యా
ఈవెంట్స్ కార్యదర్శి – శ్రీ శ్రావ్య వందనపు & మాధవ రెడ్డి
ఈవెంట్స్ కో-ఆర్డినేటర్ – ప్రశాంత్ మామిడాల, శ్రీ నీలిమ
షెఫీల్డ్ కార్యదర్శి – కె.వి.ప్రసాద్
మిల్టన్ కీన్స్ కార్యదర్శి – రాజేష్ వర్మ
రెడింగ్ కార్యదర్శి – మౌనికా డోడిల్
ఐటి కార్యదర్శి – కార్తీక్ శ్రీవాస్తవ
కోశాధికారి – వంశీ వందనపు
మహిళల సెల్ కార్యదర్శి(లు) – విజయ లక్ష్మి వంటేడు
సాంస్కృతిక కార్యదర్శి(లు) – , శ్రీ విద్య, హారిక రెడ్డి
క్రీడా కార్యదర్శి(లు) – రవి ప్రదీప్ పులుసు, నిఖిల్ రెడ్డి & పృథ్వి రావుల
క్రీడా కో-ఆర్డినేటర్లు – మణి తేజ హనుమండ్ల & సందీప్ రెడ్డి
మీడియా కార్యదర్శి(లు)- హరి గౌడ్ నవపేట్ , అంజాన్ రావు
స్పాన్సర్ కార్యదర్శి(లు)- గోట్టేముక్కల సతీష్ రెడ్డి, నాగరాజు తౌటం
సంక్షేమ, సభ్యత్వ కార్యదర్శి (లు) – స్నేహ హరి
యూత్ కో-ఆర్డినేటర్(లు) – శ్రీకాంత్ ముదిరాజ్, అబ్దుల్ క్కుదూస్
కార్యనిర్వాహక సభ్యులు – సంధ్య రాణి కర్రా ,దివ్యా గరిగబోయిన