18,766 ఆటోల రెట్రో ఫిట్టింగ్‌కు రూ.200 కోట్లు
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ సీమ్-2026’ కోసం రూ.200 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ జీవో విడుదల చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ‘తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ సీమ్-2026’ కోసం రూ.200 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ జీవో విడుదల చేశారు. క్యూర్ పరిధిలో చెల్లుబాటు అయ్యే పర్మిట్లు ఉన్న 11,254 డీజిల్, 7,512 పెట్రోల్ ఆటోలను 100శాతం ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థలోకి మారుస్తారు.
కాంపోనెంట్-ఏ కింద పాత ఆటో చాసిస్‌ను అలాగే ఉంచి ఏఐఎస్-123 ఆమోదం పొందిన ఎలక్ట్రిక్ కిట్‌ను అమర్చుకోవచ్చు. దీని కోసం గరిష్ఠంగా రూ. 1,50,000 లేదా కిట్ అసలు ధరను (ఏది తకువైతే అది) సబ్సిడీగా ఇస్తారు. కాంపోనెంట్-బీ కింద పాత ఆటోను స్రాప్ చేసి, కొత్త ఫ్యాక్టరీ-మేడ్ ఎలక్ట్రిక్ ఆటో (ఎస్5ఎం) కొనుగోలు చేసే వారికి రూ.1,50,000 నేరుగా ఆన్-రోడ్ ధరపై డీలర్ వద్దే సబ్సిడీగా తగ్గిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

