Babu Mohan | బీజేపీకి బాబూ మోహన్ రాజీనామా.. తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆవేదన
Babu Mohan | తెలంగాణలో బీజేపీ (BJP)కి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబూ మోహన్ (Babu Mohan) ఆ పార్టీకి రాజీనామా చేశారు.
Babu Mohan | తెలంగాణలో బీజేపీ (BJP)కి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబూ మోహన్ (Babu Mohan) ఆ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ కోసం తాను చాలా కష్టపడి పనిచేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ నేతలు కొందరు తనను అవమానించారని ఆరోపించారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని తాను నిర్ణయించుకున్నానని తెలిపారు. జీవితంలో కచ్చితంగా ఒక్కసారైనా అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుస్తానని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీడియా సమావేశం సందర్భంగా వేరే పార్టీలో చేరతారా..? అని ప్రశ్నించగా.. దానిపై ఇంకా ఆలోచించలేదని బాబూ మోహన్ సమాధానం ఇచ్చారు.
కాగా, బాబూమోహన్ వరంగల్ ఎంపీ టికెట్‌ను ఆశించారు. అయితే, అందుకు కమలం పార్టీ నిరాకరించిందని సమాచారం. దీంతో తీవ్ర అసంతృప్తితోనే ఆయన కమలం పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read..
India Corona | 24 గంటల్లో 157 మందికి కొవిడ్ పాజిటివ్.. ఇద్దరు మృతి
Indian Student | అమెరికాలో భారత సంతతి విద్యార్థి అనుమానాస్పద మృతి.. ఏడాదిలో ఐదో ఘటన
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

