పోలీసింగ్‌లో ఏఐ వినియోగానికి ‘టెక్ టీమ్’
రాష్ట్రంలో నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను విసృ్తతంగా ఉపయోగించాలని నిర్ణయించినట్టు డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
- డీజీపీ ఆఫీసులో శాశ్వత ప్రాతిపదికన టెక్‌టీమ్ ఏర్పాటు
- సీసీటీఎన్ఎస్, హెచ్ఆర్ఎంఎస్ను అనుసంధానిస్తూ ‘టీఎస్ కాప్స్’
- ప్రాజెక్టుల పూర్తికి ఐదుగురు ఐపీఎస్‌లతో ప్రత్యేక కోర్ టీమ్
- వివరాలు వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను విసృ్తతంగా ఉపయోగించాలని నిర్ణయించినట్టు డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. ఈ మేరకు ప్రత్యేకంగా టెక్ టీమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ పోలీసు అధికారిక వెబ్సైట్, హాక్ఐ, సీసీటీఎన్ఎస్, హెచ్ఆర్ఎంఎస్ వంటి అన్ని ప్రధాన సాంకేతిక ప్లాట్‌ఫా మ్‌లను డీజీపీ కార్యాలయ పరిధిలోకి తీసుకువచ్చి, ఒకే ఉమ్మడి వ్యవస్థ కింద పనిచేయాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు. శాశ్వత ప్రాతిపదికన ఈ టెక్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సాంకేతికతపై ఆసక్తి ఉండి, ముందుకు వచ్చే యువ పోలీసు సిబ్బందిని ఈ బృందంలో చేర్చుకుంటామని, దీనివల్ల వారు సరికొత్త ఏఐ వ్యవస్థలను నేర్చుకోవడంతో పాటు వాటి అభివృద్ధిలో చురుగ్గా భాగస్వాములు కాగలరని సీవీ ఆనంద్ వివరించారు.
అన్నీ టీఎస్-కాప్స్ పరిధిలోకే
ప్రస్తుతమున్న సీసీటీఎన్ఎస్, హెచ్ఆర్ఎంఎస్ వంటి వ్యవస్థలను అనుసంధానిస్తూ ‘టీఎస్-కాప్స్’ పేరిట ఒకే ఉమ్మడి మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాలని, దీని ద్వారా సిబ్బంది ఒకే మొబైల్ ఇంటర్ఫేస్ ద్వారా వివిధ అప్లికేషన్లను యాక్సెస్ చేసే వీలుంటుందని డీజీపీ తెలిపారు. ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌లైన సీసీటీఎన్ఎస్ 2.0ను సమర్థవంతంగా అమలు చేసేందుకు, డాటా ఆధారిత డ్యాష్ బోర్డుల రూపకల్పనకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటు ఫైళ్ల కదలికలను నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు వీలుగా డీజీపీ ఎస్టాబ్లిష్మెంట్ పరిధిలోని అన్ని కార్యాలయాలను ఈ-ఆఫీస్ సిస్టమ్‌తో అనుసంధానించాలన్నారు. సాంకేతిక కార్యక్రమాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక ఫలితాలను ఇచ్చేలా ఉండాలని సూచించారు. ఏఐ ఆధారిత ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు వీలుగా ఐదుగురు ఐపీఎస్ అధికారులతో ఒక ప్రత్యేక కోర్ టీమ్‌ను డీజీపీ ఆనంద్ ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

