హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. పండితులు, పీఈటీ, అప్‌గ్రేడెషన్ జాబితాను శనివారం విడుదల చేశారు. జిల్లాలవారీగా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందే గ్రేడ్ -2 భాషాపండిత్ పోస్టులు, పీఈటీ నుంచి పీడీగా పదోన్నతి పొందే పోస్టుల జాబితాను విడుదల చేశారు. రాష్ట్రంలో ఎస్ఏ తెలుగు పోస్టులు 5,046 ఉండగా 4,493, ఎస్ఏ హిందీ 4,353 పోస్టులకు 3,883, ఎస్ఏ ఉర్దూలో 270 పోస్టుల కు 240, మరాఠీ 13 పోస్టులకు 10, సంస్కృతం, కన్నడలో 2 పోస్టులకు 2 అప్‌గ్రేడ్ చేయనున్నారు. రాష్ట్రంలో 9,686 ఎస్ఏ పోస్టులుంటే అప్‌గ్రేడేషన్ ద్వారా 8,630 ఎస్ఏ పోస్టులను నింపుతారు. ఇక పీఈటీ పోస్టులు 2,240 ఉంటే, 1,849 పోస్టులను పీఈటీలకు పీడీలుగా పదోన్నతి కల్పించి భర్తీచేస్తారు. జిల్లాలవారీగా, పోస్టులవారీగా జాబితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.
ఆదివారం వరకు ప్రమోషన్ల కోసం ఎస్జీటీ, దాని సమానమైన కేడర్ పోస్టులకు సంబంధించిన సీనియార్టీ లిస్టులు ప్రకటిస్తారు. సూల్ అసిస్టెంట్ ఖాళీలను ప్రకటిస్తారు. సీనియార్టీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, ఎస్జీటీ పోస్టుల ఖాళీల ప్రకటన ఉంటుంది. 10,11 తేదీల్లో సీనియార్టీ లిస్టుపై డీఈవోల అభ్యంతరాల స్వీకరణ. 12న ఎస్జీటీ క్యాడర్ ఫైనల్ సీనియార్టీ లిస్టు. 13 నుంచి 16 వరకు మేనేజ్‌మెంట్లవారీగా సూల్ అసిస్టెంట్, దానిసమానమైన క్యాడర్ పోస్టుల ప్రమోషన్లకు వెబ్ఆప్షన్లు, పదోన్నతి ఉత్తర్వుల జారీ. 17న ఎస్జీటీ వేకెన్సీల జాబితా, రోస్టర్ పాయింట్ల ఆధారంగా సీనియార్టీ లిస్టు. 18 నుంచి 20వరకు ఫైనల్ సీనియార్టీ లిస్టు ప్రకటన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ. 21, 22న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు జారీచేస్తారు.
ఆదివారం వరకు జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ హెడ్ మాస్టర్ల ప్రమోషన్ల కోసం సూల్ అసిస్టెంట్ లేదా దానిసమానమైన క్యాడర్ పోస్టులకు సంబంధించిన టీచర్ల ప్రొవిజినల్ సీనియార్టీ లిస్టు, ఆబ్జెక్షన్ల స్వీకరణ, సమస్యల పరిష్కారం. 10,11 తేదీల్లో ఫైనల్ సీనియార్టీ లిస్టు, ప్రమోషన్ ఆర్డర్స్ జారీ, సూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం ఎస్జీటీలు, దానికి సమానమైన క్యాడర్ ప్రొవిజనల్ సీనియార్టీ లిస్టు. 12, 13 తేదీల్లో ప్రమోషన్ల తర్వాత సూల్ అసిస్టెంట్ ఖాళీల లిస్టు. 14, 15న సీనియా ర్టీ లిస్టుపై అభ్యంతరాలు, డీఈవోలకు ఫిర్యాదులకు అవకాశం. 16 నుంచి 18 వరకు ఫైనల్ సీనియార్టీ లిస్టు, సూల్ అసిస్టెంట్ల ట్రాన్స్‌ఫర్స్‌కు వెబ్ ఆప్షన్లు, ఎడిట్ ఆప్షన్, ఎస్జీటీ, దాని సమానమైన క్యాడర్ పోస్టులకు సంబంధించిన ఫైనల్ సీనియార్టీ లిస్టు. 19న సూల్ అసిస్టెంట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్లు. 20న సూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల కోసం ఖాళీల లిస్టును ప్రదర్శిస్తారు. 21 నుంచి 24 వరకు ఎస్జీటీల ఫైనల్ సీనియార్టీ లిస్టు, వెబ్ ఆప్షన్లు, సూల్ అసిస్టెంట్లకు పదోన్నతుల జారీ. 25న ఎస్జీటీల ఖాళీల ప్రకటన. 26 నుంచి 28 వరకు బదిలీల కోసం ఎస్జీటీల సీనియార్టీ లిస్టు, వెబ్ ఆప్షన్ల స్వీకరణ, ఎడిట్ ఆప్షన్. 29, 30 తేదీల్లో ఎస్జీటీలకు బదిలీ ఉత్తర్వులు
టీచర్ల పదోన్నతుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ) తీవ్ర నష్టం జరుగుతుందని ఎస్జీటీ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శిరందాసు రామదాసు ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్జీటీలకు 10వేల పీఎస్ హెచ్ఎం పోస్టులని ప్రకటించి, కేవలం 2,130 పోస్టులను మాత్రమే చూపారని, దీంతో తమకు తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. మల్టీ జోనల్ కేడర్ ఉపాధ్యాయ సంఘాలు తమకు జరుగుతున్న నష్టంపై చోద్యం చూస్తున్నాయని మండిపడ్డారు. పరిస్థితి చూస్తుంటే భవిష్యత్తులో ఎస్జీటీలు ఎస్జీటీలుగానే పదవీ విరమణ పొందుతారని, దీంతో తాము పదోన్నతులపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.