రాష్ట్రంలో ఆటవిక పాలన
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాలు, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ మనుషులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.
- ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటు
- బీఆర్ఎస్ను అణచివేయలేరు
- ఉగ్రవాదానికి సంజయ్ ప్రోత్సాహం
- బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి
జగిత్యాల, మే 7 (నమస్తే తెలంగాణ) : కరీంనగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై బీజేపీ గూండాలు, కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ మనుషులు దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై దాడి సభ్యసమాజానికి సిగ్గుచేటని మండిపడ్డారు. హింసతో బీఆర్ఎస్ని అణచివేయాలని చూస్తున్నారని, అది వారితో అయ్యే పని కాదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఎదిరించడం కాంగ్రెస్‌కు సాధ్యం కావడం లేదని, అందుకే బీజేపీతో కలిసి కుమ్మకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అసభ్యకరమైన భాషను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నేతలు విమర్శిస్తే, వారిపై బీజేపీ శ్రేణులు, బండి సంజయ్ అనుచరులు భౌతిక దాడులకు తెగబడడం, ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదని హితవు పలికారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

