Talasani : తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Sreenivas Yadav) అన్నారు. ఆదివారం బ ల్కంపేట ఎల్లమ్మ ఆలయం (Balkampet Yellamma Temple) వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు తలసాని. మహిళలతో కలిసి చప్పట్లు కొడుతూ బతుకమ్మ ఆడిన ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పుట్టిన బతుకమ్మ వేడుకను విశ్వవ్యాప్తంగా జరుపుకోవడం మనందరికి గర్వకారణమని పేర్కొన్నారు.
ప్రకృతిని పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు తలసాని. ఈ సందర్భంగా అడబిడ్డలందరూ సంబురంగా చేసుకునే బతుకమ్మను బీఆర్ఎస్ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా గుర్తించిందని ఎమ్మెల్యే వెల్లడించారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కన్నులపండువగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానికులు పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి తలసాని