పక్కా ఆధారాలున్నాయి.. అనర్హులుగా ప్రకటించండి
కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీలో చేరారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద తెలిపారు.
- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి
- క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, వివేకానంద
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీలో చేరారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, కేపీ వివేకానంద తెలిపారు. గురువారం శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ నేతృత్వంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌పై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జగదీశ్‌రెడ్డిల క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ పార్టీ మారినట్టు ఉన్న అన్ని ఆధారాలను స్పీకర్ ఎదుట ఉంచారు.
బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలుగానే కాకుండా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారు చేసిన ప్రసంగాలు, ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను వీడియోలతో సహా ఉన్న ఆధారాలను సమర్పించారు. స్పీకర్ చర్యలు తీసుకోవడం ఒక్కటే ఉన్నదని, వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఉదయం మొదలైన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ మధ్యాహ్నం వరకు కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, డాక్టర్ సంజయ్ కుమార్ కూడా వారి న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. శుక్రవారం కూడా విచారణ కొనసాగనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Lungs | ఢిల్లీలో యువత ఊపిరితిత్తులపైనా నల్లని మచ్చలు.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Matt Henry: తొలి ఓవర్లోనే షాకిచ్చిన మ్యాట్ హెన్రీ.. రోహిత్, కోహ్లీ, అయ్యర్ డకౌట్
డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలు పట్టివేత
Kalyana Lakshmi | పెండ్లయి పిల్లలు పుట్టాక కల్యాణ లక్ష్మి చెక్కు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

