దళిత పారిశ్రామికవేత్తలకు టీ ప్రైడ్ తోడు

- 35-45% రాయితీలు పొందే వీలు
- పరిశ్రమలశాఖలో సలహా కేంద్రాలు
- టీ ప్రైడ్‌లో రాయితీపై అనేక యూనిట్లు
- సద్వినియోగం చేసుకోవాలన్నఅధికారులు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగడానికి పరిశ్రమల శాఖ తన వంతు తోడ్పాటును అందిస్తున్నది. ఎవరైనా ఔత్సాహికులు వ్యాపారం ప్రారంభించడానికి ముందుకొస్తే.. తగిన సూచనలు అందించడంతోపాటు టీ ప్రైడ్ ద్వారా వారికి రాయితీలు కల్పించడానికి చర్యలు తీసుకొంటున్నది. ప్రస్తుతం టీ ప్రైడ్ ద్వారా ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో పురుషులకు 35%, మహిళలకు 45% సబ్సిడీ అందిస్తున్నది. దాదాపు 355 రకాల యూనిట్లు/వ్యాపారాలకు టీ ప్రైడ్ ద్వారా రాయితీ లభిస్తున్నది. దళితబంధు ద్వారా అందే సహాయంతో ఎవరైనా ఏదైనా యూనిట్ ఏర్పాటుచేసుకొంటే.. టీ ప్రైడ్ ద్వారా రాయితీ పొందవచ్చు. ప్రభుత్వం అందించే రూ.10 లక్షలకు తోడు మరో రూ.10 లక్షల వరకు రుణం తీసుకొంటే టీ ప్రైడ్ ద్వారా 35 నుంచి 45 శాతం సబ్సిడీ లభిస్తుంది. మిగతామొత్తాన్ని వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దళితబంధు ద్వారా ఎక్కువ మంది ట్రాక్టర్లు, కార్లు కొంటున్న నేపథ్యంలో పరిశ్రమలశాఖ అధికారులు దీనిపై స్పందించారు. ప్రభుత్వమిచ్చే సహాయాన్ని పెట్టుబడిగా పడితే చిన్నతరహా పరిశ్రమను స్థాపించే వీలుంటుందని అధికారులు చెప్తున్నారు.
టీప్రైడ్ ద్వారా రాయితీ లభించే వ్యాపారాలు
ఫుడ్ ప్రాసెసింగ్: బేకరీ ఐటమ్స్, బనానా చిప్స్, బేవరేజ్ తయారీ, ఐస్‌క్రీమ్ తయారీ, ఐస్‌క్రీమ్ పార్లర్, నూడుల్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సోయాసాస్, సోయా మిల్క్ తయారీ, కొబ్బరిపీచుతో తయారయ్యే ఉత్పత్తులు.
ఆగ్రో బేస్డ్ ఉత్పత్తులు: క్యాటిల్/పౌల్ట్రీ ఫీడ్ తయారీ, నూనె తయారీ
అటవీ ఉత్పత్తులు: ఆయుర్వేద ఉత్పత్తులు, పేపర్ బ్యాగ్‌లు, పేపర్ కప్పులు
సిమెంట్ కాంక్రీట్‌తో తయారుచేసే ప్రీకాస్ట్ ఉత్పత్తులు, సిమెంట్ బ్రిక్స్, ఇతర నిర్మాణ సామగ్రి, సిరామిక్ వస్తువులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, స్టోన్ పాలిషింగ్ యూనిట్, క్లీనింగ్ పౌడర్, ఫేస్ క్రీమ్‌లు, ఫుట్‌వేర్-లెదర్ యూనిట్లు, లెదర్ జువెలరీ, లెదర్ వ్యాలెట్స్, హెయిర్ ఆయిల్, మెహిందీ, నెయిల్ పాలిష్, షాంపూ తయారీ, నెఫ్లలిన్ బాల్స్, అల్యుమినియమ్ ఫ్యాబ్రికేషన్, అల్యుమినియమ్ ఫర్నీచర్, వ్యాక్స్ క్యాండిల్స్, విండ్ క్లీనర్, ఏసీలు, బస్ బాడీ బిల్డింగ్/లైట్ కమర్షియల్ వెహికిల్స్, వివిధ రకాల ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, టెక్స్టైల్ ఇండస్ట్రీ పరిధిలోని రెడీమేడ్ వస్ర్తాల తయారీ, టెక్స్టైల్ ప్రింటింగ్, మోటర్ వైండింగ్, వెబ్ డిజైనింగ్, ఉడెన్ క్ట్రాఫ్ట్స్.
టీ ప్రైడ్ ద్వారా రాయితీ పొందవచ్చు
దళితబంధు ద్వారా సహాయం పొందినవారు టీ ప్రైడ్ ద్వారా సబ్సిడీ పొందేందుకు వీలున్నది. టీ ప్రైడ్‌లో పేర్కొన్న వివిధ వ్యాపారాలు చేపట్టడం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం తరఫున సహకారం అందించేందుకు పరిశ్రమలశాఖ సిద్ధంగా ఉన్నది.
-జయేశ్ రంజన్, ముఖ్య కార్యదర్శి, పరిశ్రమలశాఖ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

