సమరాక్షరి
శ్రీయును మోక్షము శాంతి రాట్ననే వాయుతి భారతమాత కబ్బునని తా ననుభవించి లోకమున జాటు తండ్రి గాంధికిదె జోహార్
శ్రీయును మోక్షము శాంతి రాట్ననే
వాయుతి భారతమాత కబ్బునని
తా ననుభవించి లోకమున జాటు
తండ్రి గాంధికిదె జోహార్
రాట్నలక్ష్మి మన రాజ్యలక్ష్మి యని
రామభక్తి భవతరణశక్తి యని
స్వీయానుభవానంతరము జెప్పు
శ్రీ మహితామూర్తి గాంధికి జోహార్
భారత ప్రపంచము సర్వస్వమ్ము
పాశ్చాత్య నాగరికతా వార్నిధి
బడి మునుగుచుండ తెప్పయై తేల్చు
పరమ కృపానిధి గాంధికి జోహార్
అంతరించవలె నస్పృశ్యత యే
నన్మజ్జీవిత మేని తదర్థం
బని చాటి చెప్పు ధీరమూర్తి యగు
నా మహాత్మునకు జోహార్
స్వీయ సౌఖ్య సర్వస్వత్యాగము
జేసి మాతృ దేశోద్ధరణార్థము
కార్యరంగమున కొదమ సింగముల
కరణి దుముకు త్యాగుల కిదె జోహార్
– శ్రీ పుతుంబాక ,దుర్గాప్రసాదరావు
(గోల్కొండ కవుల సంచిక నుంచి)
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇరాన్పైకి ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’!
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

