జనగణ ‘మన గీతం’
‘స్వాతంత్య్రం మా జన్మ హక్కు’ అని నినదించిన కాలాన జయజయధ్వానాలు పలికిన సంగీతం.. జనగణమన గీతం!
‘స్వాతంత్య్రం మా జన్మ హక్కు’ అని నినదించిన కాలాన జయజయధ్వానాలు పలికిన సంగీతం.. జనగణమన గీతం! యుగయుగాలుగా భారతీయతను స్థిరపరిచిన విధాతను కీర్తించిన పాట ప్రతి రోజూ ప్రభాత గీతమే. నిన్నటిదాకా ‘జయజయహే తెలంగాణ’ని ఆలపించిన నేల గుండెలనిండా దేశభక్తితో భారతీయతకు జయము కలిగించమని జయ జయ జయహే ఆలపిస్తోంది. రవీంద్రుని తలపుల విధాత పాటకు నేడు పట్టాభిషేకం! ‘మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా’ని మళ్లీ మళ్లీ ఆలపిద్దాం.
కలకత్తాలో డిసెంబరు 27, 1911న జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో మొదటి రోజు వందేమాతరం ఆలపించి, ప్రారంభించారు. రెండో రోజున జనగణమన ఆలపించిన తర్వాత సమావేశాలు ప్రారంభమయ్యాయి. తర్వాత రోజు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలు పెద్ద దుమారం రేపాయి. బ్రిటిష్ చక్రవర్తి 5వ కింగ్ జార్జ్‌ని కీర్తిస్తూ ఠాగూర్ జనగణమన గీతం రాశాడని, కాంగ్రెస్ సమావేశాల్లో చక్రవర్తికి స్వాగతం పలుకుతూ ఆలపించారని పత్రికలు ప్రచురించాయి. స్టేట్స్‌మన్, ఇంగ్లిష్మన్, ఇండియన్ పత్రికల్లో వచ్చిన ఈ కథనాలు ఠాగూర్ని ఆవేదనకు గురిచేశాయి.
మచ్చలేని ప్రభాత గీతం!
ఆ కథనాలకు భిన్నంగా దేవుడిని స్తుతిస్తూ ప్రార్థనాగీతం ఆలపించిన సమావేశాలు ప్రారంభమయ్యాయని, ఆ తర్వాత కింగ్ జార్జ్ పట్ల విధేయతను చాటుతూ కాంగ్రెస్ తీర్మానం చేశారని, కింగ్ జార్జ్‌కు స్వాగతం పలుకుతూ ఓ హిందీ పాట పాడారని అమృత బజార్ పత్రిక వాస్తవాన్ని తెలియజేసింది. ‘బెంగాలీ’ అనే పత్రిక కూడా ఇదే విధమైన కథనం ప్రచురించింది. జనగణమన ఆలాపన వివాదంపట్ల అప్పటికే కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. అయినా.. నిజం చెప్పులు తొడిగే లోగా అబద్ధం ఊరంతా చుట్టొచ్చినట్టు ఠాగూర్ వ్యక్తిత్వంపట్ల, ఆయన గీతంపట్ల లేనిపోని పుకార్లు షికారు చేశాయి. ఆనాటి పరిణామాలకు ఠాగూర్ మనస్తాపం చెందాడు.
రవీంద్ర హృదయం
ఆనాటి వివాదం గురించి ఠాగూర్ తన మిత్రుడు పులిన్ బిహారీ సేన్‌కి 1937 నవంబర్ 10న రాసిన లేఖలో ‘చక్రవర్తి సేవకుడైన తన స్నేహితుడొకరు కింగ్జార్జ్ని కీర్తిస్తూ ఒక గేయం రాయాలని నన్ను అడిగాడు. ఆ మిత్రుని కోరిక నన్ను ఆశ్చర్యపరిచింది. నేను జనగణమనలో విధాత విజయాన్ని ప్రకటించాను. ఆ విజయానికి 5వకింగ్ జార్జ్ కాదు కదా ఆరో కింగ్ జార్జ్, మరో చక్రవర్తి ఎవరికీ అర్హత లేదు’ అని రాశాడు.

జనగణమన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధ్, గుజరాత, మరాఠా
ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ ,
ఉచ్చల జలధి తరంగ!
తవ శుభనామే జాగే!
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా!
జనగణ మంగళదాయక జయ హే!
భారత భాగ్య విధాతా!
జయ హే! జయ హే! జయ హే!
జయ జయ జయ జయ హే!!
- కలకత్తా నగరంలో 1911లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో జనం సమక్షంలో మొదటిసారి ‘జనగణమన’ ఆలపించారు.
- బ్రహ్మసమాజం ప్రభావంతో విధాతను ఆరాధిస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలో ‘భారత భాగ్య విధాత’ గీతం రాశాడు.
- ఈ పాటకు బాణీ కట్టింది కూడా ఠాగూరే! దీనేంద్రనాథ్ ఠాగూర్ సహకారంతో జనగణమన గీతాన్ని ఇప్పుడు పాడుతున్న బాణిలో డిసెంబరు 11, 1911న స్వరపరిచారు.
- ఈ గీతానికి ఆంగ్లేయురాలు మార్గరెట్ కజిన్స్ నొటేషన్స్ సమకూర్చింది.
- భారత రాజ్యంగ సభ జనవరి 24 1950లో జన గణ మన గీతాన్ని భారత జాతీయ గీతంగా ఆమోదించింది. అయిదు పాదాలున్న ‘భారత భాగ్య విధాత’లోని మొదటి పాదాన్ని జాతీయ గీతంగా స్వీకరించారు.
- మదనపల్లిలోని బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్‌ని 1919లో ఠాగూర్ సందర్శించాడు. ఆ కాలేజీలో ఉన్నప్పుడు జన గణ మన గీతాన్ని ‘మార్నింగ్ స్టార్ ఆఫ్ ఇండియా’ పేరుతో అనువదించాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

