సురవరం ఖ్యాతి చాటేలా జయంత్యుత్సవాలు

- వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా కార్యక్రమాలు
- సురవరం పేరిట సదస్సులు, పోటీల నిర్వహణ
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వైతాళికుడు, సామాజిక చరిత్రకారుడు, గోలకొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతిని (మే 28న) పురస్కరించుకొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తుకు 1944-46.. రెండేండ్లపాటు అధ్యక్షుడిగా సేవలందించిన అనుబంధంతో సురవరం పేరిట పరిషత్ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
- తెలంగాణకు వన్నె తెచ్చిన ప్రథమాంధ్ర మహాసభది చారిత్రక ప్రాధాన్యత. 1930లో జోగిపేటలో జరిగిన ఈ సభకు సురవరం ప్రతాపరెడ్డి తన 34వ ఏట అధ్యక్షత వహించారు. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆ ప్రాంతంలో సారస్వత పరిషత్తు, సురవరం కుటుంబం, సాహిత్య వైజయంతి ట్రస్ట్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నది.
- సురవరం జన్మించిన పాలమూరు జిల్లా లో, ఆయన తొలి శాసనసభ్యునిగా సేవలందించిన వనపర్తిలో, స్వగ్రామం ఉన్న గద్వాలలో ఏప్రిల్‌లో జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు.
- వర్కింగ్ జర్నలిస్టు యూనియన్, సారస్వత పరిషత్, సాహిత్య వైజయంతి ట్రస్టు ఆధ్వర్యంలో.. ఏప్రిల్ 4న మహబూబ్‌నగర్‌లో సదస్సు జరుగనుంది.
- ప్రతాపరెడ్డి జీవిత విశేషాలను తెలియజెప్పేందుకు వైజయంతి ట్రస్టు ఆధ్వర్యంలో ఒక వెబ్‌సైట్‌ను రూపొందించారు. జర్నలిజం, సాహిత్యం, సాంఘిక చరిత్ర, లలితకళలు, సంసఘ సంస్కరణ రంగాల్లో విశేష కృషిచేసిన వారికి రూ.లక్ష నగదు పురస్కారం ఇవ్వాలని కూడా ట్రస్టు నిర్ణయించింది.
- భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో సురవరం కథల ఆధారంగా లఘు చిత్రాల నిర్మాణంలో పోటీలు నిర్వహించనున్నారు.
- ప్రతాపరెడ్డి జన్మస్థలం ఇటిక్యాలపాడుకు సమీపంలో రాజోలు రహదారికి ఆనుకుని సురవరం విగ్రహం నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
- తెలంగాణ ప్రభుత్వం తరఫున మే 28న రవీంద్రభారతిలో సురవరం ప్రతాప్‌రెడ్డి జయంతి ఉత్సవాలను వైభంగా నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

