హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ) : ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. హైదరాబాద్ మెట్టుగూడలోని రైల్వే ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడిగా పీఅండ్ఈఐలో విధులు నిర్వర్తిస్తున్న సూర కృష్ణ ఎన్నికయ్యారు.
ప్రధాన కార్యదర్శిగా కే చిరంజీవి, ఉపాధ్యక్షుడిగా ఎం మల్లయ్య, కోశాధికారిగా భాస్కర్‌రావు, మరో ఇద్దరు ఉపాధ్యక్షులు, ముగ్గురు అసోసియేట్ అధ్యక్షులు, ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, ముగ్గురు ఆర్గనైజింగ్ సెక్రటరీలు, ఆరుగురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా ఎంపీఆర్ చంద్రశేఖర్, ప్రిసైడింగ్ అధికారిగా నాగార్జున్‌రెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా మంగు శ్రవణ్, ఎన్నికల పరిశీలకులుగా మధుబాబు, రామకృష్ణ, శ్రీనివాసరావు వ్యవహరించారు.