యాదాద్రి భువనగిరి జిల్లా: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.
స్వామివారి దర్శనం అనంతరం వారికి గర్భాలయ ముఖమండపంలో ప్రధాన అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వారితోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, నాల్సా మెంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ జైన్, తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.