కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంలో ఎదురుదెబ్బ
ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెకింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మే 30న కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది.
- పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెకింపు వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మే 30న కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ‘ఫాం-13ఏ’పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలు.. ఆయన పేరు, హోదా, సీలు లేకపోయినా ఓట్లు చెల్లుబాటవుతాయని ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను వైసీపీ హైకోర్టులో సవాల్ చేసింది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వుల విషయంలో జోక్యం చేసుకోమని హైకోర్టు డివిజన్‌బెంచ్ స్పష్టం చేసింది. దీంతో ఉత్వర్వులపై వైసీపీ సుప్రీంలో సవాల్ చేసింది. సోమవారం విచారణ జరిపిన జస్టిస్‌లు అరవింద్‌కుమార్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

