నిర్మల్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): నిర్మల్లోని బంగల్పేట్కు చెందిన గన్నేరు సాయమ్మకు ఆసరా పింఛను కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అనారోగ్యంతో భర్త చనిపోవడం, ఆ షాక్ నుంచి కోలుకోక ముందే చేతికొచ్చిన చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ కుటుంబం కుప్పకూలింది. మరో కొడుకును పోషించేందుకు ఆమె జీవన పోరాటాన్ని మొదలుపెట్టింది. భర్త చేసిన అప్పులు, పేదరికాన్ని తట్టుకొంటూ జీవితం ఎలా ముందుకు నడపాలో తెలియని స్థితికి వెళ్లింది. బీడీలు చేసినా నెలకు రూ.1,000 కంటే ఎక్కువ రాకపోయేది. ఇల్లు గడిచేది ఎట్లా అని బాధపడుతున్న సమయంలో సీఎం కేసీఆర్ నెలకు రూ.2 వేల పెన్షన్ ప్రవేశపెట్టి ఆసరా పథకాన్ని అమలు చేయడంతో ఆమె జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. తాను కూలీ చేసుకొంటూ సంపాదించేదానికి ఆసరా పింఛను తోడవుతున్నదని గన్నేరు సాయమ్మ ఎంతో ఆత్మైస్థెర్యంతో చెప్తున్నది. ‘దిక్కూదివాణం కనిపించని నా జీవితానికి ఆసరా పింఛన్ ఇచ్చి అక్కున చేర్చుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్కు చేతులెత్తి మొక్కుతున్న. ఆయనకు ఎన్ని జన్మలైనా రుణపడి ఉంట’ అని పేర్కొన్నది.