Sunday Funday | నేడు చార్మినార్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
Charminar | హైదరాబాద్ నగరవారుసులకు మరింత ఆహ్లాదం అందనుంది. నిత్యం పర్యాటకులు, వ్యాపారులు, వాహనాలతో కిటకిటలాడే చార్మినార్ నేడు ప్రశాంత వాతావరణంలో దర్శనమివ్వనుంది.

హైదరాబాద్: హైదరాబాద్ నగరవారుసులకు మరింత ఆహ్లాదం అందనుంది. నిత్యం పర్యాటకులు, వ్యాపారులు, వాహనాలతో కిటకిటలాడే చార్మినార్ నేడు ప్రశాంత వాతావరణంలో దర్శనమివ్వనుంది. ఈ పురాతన కట్టడాన్ని తనివితీరా చూస్తూ, ఇష్టం వచ్చిన వస్తువులను, ఆహార పదార్థాలను కొనుక్కునే అవకాశం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. గత కొన్ని రోజులుగా ప్రతి ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే-ఫండే (Sunday Funday) కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరుతో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.

చార్మినార్ వద్ద ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సండే-ఫన్డే కార్యక్రమం కొనసాగనుంది. సాయంత్రం 6:30 గంటలకు పోలీస్ బ్యాండ్ నిర్వహించనున్నారు. రాత్రి 8:30 గంటలకు దక్కనీ మజాహియా ముషారియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇక అర్ధరాత్రి వరకు లాడ్ బజార్‌ను తెరిచి ఉంచనున్నారు. పిల్లలను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను రూపొందించారు. భోజన ప్రియులకు నోరూరించే ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. సండే-ఫన్‌డేకు వచ్చే వాహనదారులకు నాలుగు ప్రదేశాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

