కలెక్టరేట్‌పై ఆత్మహత్యాయత్నం
ఐదేళ్లుగా తన భూసమస్య పరిష్కారం కావడం లేదంటూ జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి సోమవారం ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. జనగామ మండలం పసరమడ్ల గ్రామంలో సర్వే నంబర్ 159, 160, 231/డీలో నర్సింగరావు తండ్రికి పూర్వీకుల నుంచి వచ్చిన 3.15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
- భూ సమస్య పరిష్కరించడం లేదంటూ ఆవేదన
- పురుగుల మందు తాగగా దవాఖానకు తరలింపు
జనగామ/జనగామ చౌరస్తా, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఐదేళ్లుగా తన భూసమస్య పరిష్కారం కావడం లేదంటూ జనగామ కలెక్టరేట్ భవనం పైకెక్కి సోమవారం ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. జనగామ మండలం పసరమడ్ల గ్రామంలో సర్వే నంబర్ 159, 160, 231/డీలో నర్సింగరావు తండ్రికి పూర్వీకుల నుంచి వచ్చిన 3.15 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.
బతుకుదెరువు కోసం వీరి కుటుంబం 2016 లో మేడారం వలస వెళ్లింది. దీంతో దాయాదులు సదరు భూ యజమానులు చనిపోయారని నమ్మించి 2017లో అప్పటి తహసీల్దార్ జే రమేశ్, వీఆర్వో క్రాంతిని సంప్రదించి పాండు, ఎల్లయ్య, ఉపేందర్, శివకుమార్ పే ర్లపై అక్రమంగా పట్టా చేసుకున్నారు. విష యం తెలుసుకున్న నర్సింగరావు ఐదేండ్లుగా భూ సమస్యను పరిషరించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు.
ప్రజావాణి లో పలుమార్లు వినతులు ఇచ్చినా, కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేకపోవడంతో గతంలో మూడు సార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. సోమవారం కూడా సమీకృత కలెక్టరేట్ భవనంపైకి ఎక్కి వెంట తెచ్చుకున్న ఫ్లెక్సీని గోడకు కట్టి పురుగుల మందు తాగాడు. సమాచారం అందుకున్న పోలీసులు నర్సింగరావును జిల్లా ప్రధాన దవాఖానకు తరలించారు.
కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, నర్సింగరావుపై చట్టపరమైన చర్యలు తీసుకునే విషయం పరిశీలిస్తామని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భూమి వివాదం జనగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. అక్కడే పరిష్కరించుకోవాలని గతంలో నర్సింగరావుకు అధికారులు సూచించారని కలెక్టర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

